AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. పార్టీలు తమ పరపతిని పెంచుకోవాలని భావిస్తున్నాయి. ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నేతలు చేరేందుకు సిద్దపడుతున్నారు. పార్టీలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు టీడీపీలో ప్రస్తుతం బలమైన నేతలు లేకపోవడంతో పార్టీలోకి వచ్చి చేరుతున్న నేతలతో పార్టీకి ఎలాంటి ఢోకా లేకుండా పోయిందని తెలుస్తోంది.

ఈ క్రమంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. దీంతో టీడీపీకి మంచి నాయకుడు లేకుండా పోయారు. దీంతో ఆదినారాయణ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో పార్టీకి పట్టు దొరికినట్లు అయింది. ఈ నేపథ్యంలో టీడీపీకి కొంత బలం చేకూరుతుందని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మునిగి పోతున్న నావ. దీంతో అందులోని నాయకులంతా ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. ఇన్నాళ్లు పార్టీని పట్టుకుని వేలాడిన జీవీ రెడ్డి ప్రస్తుతం వేరే దారి చూసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మార్పు అనివార్యమని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన టీడీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం.
Also Read: Pawan kalyan: పవన్ భారీ విరాళం వెనుక ‘దళిత ఓటు బ్యాంక్’ కథ!
ఏపీలో రెడ్డి సామాజికవర్గం నేతలు ఇప్పుడు టీడీపీలో చేరాలని భావిస్తున్నారు. వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులంతా టీడీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భారీ ఎత్తున నేతలు టీడీపీలోకి రావడంతో పార్టీ బలోపేతం అవుతుందని అందరు భావిస్తున్నారు.