Homeఎంటర్టైన్మెంట్Soundarya: కృష్ణ వంశీ...

Soundarya: కృష్ణ వంశీ చేసిన ఆ పనికి సెట్స్ నుంచి వెళ్లిపోయిన సౌందర్య

Soundarya: క్రియేటివ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు దర్శకుడు కృష్ణ వంశీ. ఈయన చేసిన చాలా సినిమా మంచి సక్సెస్ ను అందుకున్నాయి. అంతేకాదు ఆ సినిమాలన్నీ కూడా ఇండస్ట్రీలో ఈయనను క్రియేటివ్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. ఈయన సినిమాలు వైవిధ్యభరితంగా మాత్రమే కాదు.. ఆ సినిమాను చూస్తున్నంత సేపు బోర్ లేకుండా ఆసక్తిని పెంచేలా ఉంటాయి. అలా ఈయన మంచి పేరు సంపాదించారు.

నాగార్జున హీరోగా వచ్చిన నిన్నే పెళ్లాడుతా సినిమా ఏ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించి వంశీ మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి విజయాలను అందించాయి. ఇలా అన్ని జానర్ లో సినిమాలు చేస్తూ తన సత్తా చాటాడు వంశీ కృష్ణ. ముఖ్యంగా ప్రకాష్ రాజ్, సౌందర్య లు ప్రధాన పాత్రలో వచ్చిన అంత:పురం సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నారు ఈ డైరెక్టర్.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ యాక్టింగ్ కు చాలా అవార్డులు కూడా వచ్చాయి. అయితే కృష్ణ వంశీ సినిమాలకు మిగతా డైరెక్టర్ల సినిమాలకు తేడా ఏంటంటే.. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ జీవించేలా ఉంటుంది. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం కొన్ని విషయాల్లో రాజీ పడతారు. కానీ వంశీ అలా కాదు. ఈయన తెరకెక్కించే ఏ సినిమాలోని ఆర్టిస్ట్ అయినా ఆ పాత్రలోకి జీవించాల్సిందే అంటారు. అందుకే ఏ ఆర్టిస్ట్ అయినా కృష్ణ వంశీతో ఒక సినిమా అయినా చేయాలి అనుకుంటారు.

అయితే అంత:పురం సినిమాలో ఒక సీన్ లో ప్రకాష్ రాజ్ సౌందర్యను కొడతాడు. అందులో ఈ డైరెక్టర్ ప్రకాష్ రాజ్ తో సౌందర్యను నిజంగా కొట్టించాడు. దాంతో ఫీలైన సౌందర్య సెట్ నుంచి వెళ్లిపోయిందట. అయితే సీన్ నాచురల్ గా లేదని.. అందుకే అలా కొట్టమన్నాను అని వంశీ వెళ్లి సౌందర్యతో చెప్పాడట. అప్పుడు మళ్లీ సౌందర్య వచ్చి షూటింగ్ లో పాల్గొందట. మొత్తం మీద సీన్ ను నాచురల్ గా వచ్చేలా చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సీన్ ను చూసి సౌందర్య డైరెక్టర్ టాలెంట్ ను పొగిడిందట.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

Telegram CEO Pavel Durov: కంపెనీలను తయారు చేయాలి అనుకుంటే ఆ సబ్జెక్టు నేర్చుకోవాలి

Telegram CEO Pavel Durov: టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ విద్యార్థులకు కీలక సూచనలు, సలహాలు అందించారు. భవిష్యత్తులో మంచి కంపెనీలను స్థాపించాలంటే,ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించాలంటే వారికి ఏ సబ్జెక్ట్ మంచిదో తెలిపారు. ఎలాంటి సబ్జెక్ట్‌ను ప్రాధాన్యత ఇవ్వాలో కూడా ఆయన వెల్లడించారు. ఇంతకీ ఆయన చేసిన సూచనలు సలహాలు ఏంటి అనుకుంటున్నారా? ఈ విషయమై...

Male Ear Piercing: అబ్బాయిలు చెవి కుట్టించుకుంటే బెటరా? కాదా? ఏది నిజం?

Male Ear Piercing: హె డియర్స్. ఇప్పుడు మనం ఒక భలే ఇంట్రెస్ట్ టాపిక్ గురించి తెలుసుకుందామా? సాధారణంగా ఆడవాళ్లు చెవులు కుట్టించుకుంటారు. అదంతా బాల్యంలోనే జరుగుతుంది. తర్వాత కావాలి అంటే చెవిలోనే కాస్త పైకి మధ్యలో కూడా చెవి కుట్టించుకొని అలంకరించుకుంటారు. కానీ అబ్బాయిలకు కూడా ఈ చెవి పోగులు ఉంటాయి. ఇలాంటి...

Health Alert: సమోసా, వడపావ్, జిలేబీ లు తింటున్నారా?

Health Alert: సమోసా, వడ పావ్, జిలేబీ, గులాబ్ జామూన్ ల పేరు వింటే చాలు ఎంత నోరు ఊరుతుంది కదా. ఇవంటే చాలా మందికి ఇష్టం. కనిపిస్తే నోరూ ఊరడమే కాదు గుటుక్కుమన మింగేస్తారు చాలా మంది. కానీ మీరు కూడా ఇలాగే తింటే ఓ హెల్త్ వార్నింగ్ వచ్చింది. దాని గురించి...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.