https://oktelugu.com/

Sonu Sood: చిరు వ్యాపారులకు అండగా ఉండాలంటున్న సోనూసూద్​.. ట్వీట్టర్​లో వీడియో వైరల్​!

Sonu Sood: కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాలీవుడ్​ నటుడు సోనూసూద్​ అభాగ్యులకు అండగా నిలిచి పేదల పాలిట రియల్​ హీరోగా మారారు. రైతులు, కార్మికులు, రోగులు.. ఇలా ఆయన్ని సాయం కోరినవారికి తోచిన సాయం చేస్తూ స్టార్​గా నిలిచారు. దీంతో పాటు, పలువుర సమస్యలను సోనూసూద్​ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇలా ఆయన చేస్తున్న సేవలకు కొంతమంది అభిమానులు ఆయన ఇంటి వద్దకు వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా, సోనూసూద్​ తన ఇంటి ముందుకు వచ్చిన కూరగాయల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 6, 2021 / 04:35 PM IST
    Follow us on

    Sonu Sood: కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాలీవుడ్​ నటుడు సోనూసూద్​ అభాగ్యులకు అండగా నిలిచి పేదల పాలిట రియల్​ హీరోగా మారారు. రైతులు, కార్మికులు, రోగులు.. ఇలా ఆయన్ని సాయం కోరినవారికి తోచిన సాయం చేస్తూ స్టార్​గా నిలిచారు. దీంతో పాటు, పలువుర సమస్యలను సోనూసూద్​ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇలా ఆయన చేస్తున్న సేవలకు కొంతమంది అభిమానులు ఆయన ఇంటి వద్దకు వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా, సోనూసూద్​ తన ఇంటి ముందుకు వచ్చిన కూరగాయల బండి వచ్చింది. అదే సమయంలో సోనూసూద్​ బయటికి వచ్చారు. దీంతో వారి బండిలో ఉన్న కూరగాయల ధరల గురించి సోనూసూద్ అడిగి తెలుసుకున్నారు.

    https://twitter.com/SonuSood/status/1456851738485354496?s=20

    ఈ క్రమంంలోనే వారు ఎక్కడ నుంచి వచ్చారో అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే బండి మీద కూరగాయలు అమ్మే వారి వద్ద తాజా కూరగాయలు ఉంటాయని అన్నారు. వారి వద్ద కూరగాయలు కొంటే చిరు వ్యాపారులకు సాయం అందించినట్లు అవుతుందని అన్నారు. ఈ క్రమంలోనే ఓ వీడియోను సోనూసూద్​ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

    ట్విట్టర్​లో వీడియో కింద ‘తాజా కూరగాయల డెలివరీ కోసం నాకు ఆర్డర్‌ చేయండి’ అని కామెంట్‌ చేశారు సోనూసుద్​. ఇటీవల సోనుసూద్‌ రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.  దానికి తోడు  ఇటీవల ఎన్నిక‌ల్లో గెలుపొందిన రాజ‌కీయ నాయ‌కులు త‌మ మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాలు అమ‌లు చేయ‌క‌పోతే వారు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని సోనూసూద్​ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.