https://oktelugu.com/

Kalyan Ram: ఈ కథకు సెట్ కాదు, దర్శకుడి వాదన.. నా మార్కెట్ కి వర్కౌట్ కాదు, హీరో వాదన !

Kalyan Ram: రాజమౌళి ‘తెలుగు సినిమా ఖ్యాతి’ని ప్రపంచ స్థాయికి ఏ స్థాయిలో తీసుకు వెళ్లాడో తెలియదు గానీ, తెలుగు సినిమా రంగానికి, తెలుగు హీరోలకు మాత్రం ఆయన రెండు కొత్త విషయాలు నేర్పాడు. ఒకటి పాన్ ఇండియా సినిమా చేయడం, రెండు ఒక సినిమాను రెండు భాగాలుగా తీయడం. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా ఆలోచనలతోనే తమ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడు.. స్క్రీన్ పేరును వశిష్టగా మార్చుకున్నాడు లేండి. […]

Written By:
  • Shiva
  • , Updated On : November 6, 2021 / 04:17 PM IST
    Follow us on

    Hero Kalyan Ram

    Kalyan Ram: రాజమౌళి ‘తెలుగు సినిమా ఖ్యాతి’ని ప్రపంచ స్థాయికి ఏ స్థాయిలో తీసుకు వెళ్లాడో తెలియదు గానీ, తెలుగు సినిమా రంగానికి, తెలుగు హీరోలకు మాత్రం ఆయన రెండు కొత్త విషయాలు నేర్పాడు. ఒకటి పాన్ ఇండియా సినిమా చేయడం, రెండు ఒక సినిమాను రెండు భాగాలుగా తీయడం. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా ఆలోచనలతోనే తమ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు.

    మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడు.. స్క్రీన్ పేరును వశిష్టగా మార్చుకున్నాడు లేండి. అతగాడి దర్శకత్వంలో ‘బింబిసార’ అంటూ హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా ఓ పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటిస్తూ.. పైగా ఆ చిత్రాన్ని తానే నిర్మిస్తున్నాడు. మరి కళ్యాణ్ రామ్ ను పెట్టి ‘పాన్ ఇండియా సినిమా’ ఎవరు నిర్మించరు కదా. కాబట్టి.. కళ్యాణ్ రామే ఈ సినిమా నిర్మాణం చేపట్టవలసి వచ్చింది.

    అయితే, ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఇప్పుడు కళ్యాణ్ రామ్(Kalyan Ram) కిందామీదా పడాల్సి వస్తోంది. మొదట 40 కోట్లు బడ్జెట్ అనుకుని సినిమాను స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరో పది కోట్లు ఎక్కువ బడ్జెట్ అయ్యేలా ఉంది. పైగా రెమ్యునరేషన్స్ అదనం. ఈ లెక్కన ఈ సినిమా తన మార్కెట్ కి వర్కౌట్ కాదు అని, కళ్యాణ్ రామ్ కి ఇప్పుడు అర్ధం అయిందట. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.

    ఎందుకంటే.. ఇప్పటికే, సినిమా షూటింగ్ సగం పూర్తి అయింది. పైగా అశోకుడి తాత కాలం నాటి కథతో తయారవుతున్న సినిమా ఇది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఇది చాలా పెద్ద సినిమా. అందుకే, రెండు భాగాలు చేస్తే బెటర్ అనే ఆలోచనలు చేశారు. తాజాగా అందుకు తగ్గట్టు స్క్రిప్ట్ లో మార్పులు చేశారు. అయితే, మార్పులు చేశాక, స్క్రిప్ట్ చూస్తే బాగా ల్యాగ్ అయిపోయింది.

    దాంతో ఇప్పుడు మళ్ళీ స్క్రిప్ట్ పై డిస్కషన్లు సాగుతున్నాయి. ఏ సీన్ తీసేయాలి అనే దాని పై క్లారిటీ లేదట. అసలు రెండు భాగాలుగా చేయడం ఈ కథకు ఎంత మాత్రం మంచిది కాదు అనేది దర్శకుడు వాదన. కానీ, సింగిల్ పార్ట్ గా రిలీజ్ చేస్తే మార్కెట్ పరంగా ఎంత మాత్రం వర్కౌట్ కాదు అనేది హీరో వాదన. మరి చివరకు ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

    Also Read: ఎన్టీఆర్​ కుడి చేతికి సర్జరీ.. కోలుకోవాలని అభిమానుల ప్రార్ధనలు!

    Tags