Star Heroes Sons: తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఢీకొట్టే ఇండస్ట్రీ మరొకటి లేదనే రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నారు. మన హీరోలు చేసిన అన్ని సినిమాలు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అవుతుంటే మన ఇండస్ట్రీకి ప్రస్తుతం చాలా గొప్ప గౌరవం దక్కుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి గట్టి పోటీ ఎదురయ్యేది. అసలు మన సినిమాలని వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. మన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని బాలీవుడ్ హీరోలు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదొక శుభ పరిణామం అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు… స్టార్ హీరోల కొడుకులు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారు. మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ, పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరా నందన్ తో పాటు రవితేజ కొడుకు మహాధన్ కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
అయినప్పటికి రవితేజ మాత్రం తన కొడుకు మహాధన్ ను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేర్పించాడు… వెంకీ అట్లూరి – సూర్య కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి మహ ధన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు..ఇక పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ సైతం ఇప్పటికే ఒక హాలీవుడ్ సినిమాకి దర్శకత్వ విభాగంలో పని చేస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక .త్రివిక్రమ్ కొడుకు సైతం సందీప్ రెడ్డి గంగా దగ్గర ‘స్పిరిట్’ సినిమాకి దర్శకత్వ విభాగంలో పనిచేస్తున్నాడు… ఇలా హీరోలు, దర్శకుల కొడుకులు దర్శకత్వం మీద పరిజ్ఞానాన్ని సంపాదించుకొని ఆ తర్వాత హీరోలుగా మారాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఏ స్టోరీ సక్సెస్ అవుతోంది .ఆ మూవీ మేకింగ్ ఎలా ఉండబోతోంది అనేది వాళ్ళకి ఈజీగా ఐడియా వస్తోంది…
దానిద్వారా వాళ్ళు ఏ సినిమాలు చేయాలనేది నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది…ఇక ఇందులో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు… హీరోలుగా రాణిస్తారా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక రవితేజ లాంటి హీరో కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని హీరోగా నిలబడ్డాడు. అందుకే తన కొడుకుకి సైతం ఫిలిం మేకింగ్ మీద అవగాహన రావాలంటే ఒక సినిమాకి దర్శకత్వం విభాగం లో పనిచేస్తేనే బెటర్ అని భావించిన రవితేజ వెంకీ అట్లూరి దగ్గర జాయిన్ చేయించినట్లు తెలుస్తోంది…