Mahesh Babu-Prabhas multistarrer: నేడు ప్రభాస్(Rebel Star Prabhas) పుట్టిన రోజు అవ్వడం తో సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఆయన అభిమానుల మేనియా నే కనిపిస్తుంది. సెలబ్రిటీలు కూడా ప్రత్యేకించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) కూడా ఒకరు. ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటి వరకు సోషల్ మీడియా లో ఎవరికీ తెలియని ఫోటో ని అభిమానులకు షేర్ చేసాడు. ప్రభాస్ కెరీర్ ప్రారంభం లో మహేష్ ఆయనకు సినిమాకు సంబంధించిన ఈవెంట్ కి ముఖ్య అతిథి గా హాజరయ్యాడు. ఆ సమయం లో మీడియా తీసిన ఒక ఫోటోని షేర్ చేసాడు. దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. మా హీరో గొప్పంటే, మా హీరో గొప్ప అంటూ తిట్టుకుంటూ ఉంటారు.
కానీ నేడు మహేష్ బాబు వేసిన ఆ ఒక్క పోస్ట్ ఈ ఇద్దరి హీరోల అభిమానులను ఏకం చేసింది. ఎందుకంటే ప్రభాస్ పుట్టినరోజు కి ఒక్క సెలబ్రిటీ కూడా విష్ చేయలేదు. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ప్రభాస్ కి క్లోజ్ ఫ్రెండ్స్. కానీ ఒక్క ట్వీట్ కూడా వాళ్ళ నుండి పడలేదు. కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఇలాంటి సమయం లో మహేష్ శుభాకాంక్షలు తెలపడం తో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. అంతే కాదు వీళ్లిద్దరి హీరోలకు సంబంధించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. అదేమిటంటే అప్పట్లో ప్రభాస్, మహేష్ కాంబినేషన్ లో ఒక క్రేజీ మల్టీస్టార్రర్ ని నిర్మించడానికి ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు తెగ ప్రయత్నం చేసాడట.
తమిళ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మించాలని చూసారు. కథా చర్చలు కూడా జరిగాయి. ఇద్దరి హీరోలకు ఆ కథ నచ్చింది కూడా. కానీ ఎవరి కమిట్మెంట్స్ లో వాళ్ళు బిజీ గా అవ్వడం తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకొని రాలేకపోయారు. ఒకవేళ ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చి ఉండుంటే ఆరోజుల్లోనే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేది. కానీ ఇప్పటికీ వీళ్ళ కాంబినేషన్ లో భవిష్యత్తులో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మల్టీస్టార్రర్ చిత్రాలు సర్వసాధారణం అయ్యాయి కాబట్టి. రాజమౌళి తెరకెక్కించే మహాభారతం లో వీళ్లిద్దరు కలిసి నటించే అవకాశం ఉంది.