Padma Awards 2025
Padma Awards 2025: దేశంలో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి కేంద్రం ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలు ప్రధానం చేస్తోంది. 2025 సంవత్సరానికి గాను ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఇందులో పలువురు తెలుగువారు కూడా ఉన్నారు. తెలంగాణకు చెందిన దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డిని వైద్య రంగంలో పద్మ విభూషణ్ వరించింది. ఏపీ నుంచి కళల విభాగంలో బాలకృష్ణను పద్మ భూషణ్ వరించింది. క్రీడలు, కళలు, వ్యవసాయం, వైద్య రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు ప్రకటించింది. వారి సేవలను పరిగణనలోకి తీసుకుని పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులకు ఎంపిక చేసింది. కేంద్రం ప్రకటించిన జాబితాలో కువైట్‌కు చెందిన యోగా ట్రైనర్ యాపిల్ చక్రవర్తి హరిమాన్, బ్రెజిల్‌కు చెందిన వేదాంత గురువు జోనాస్ మాసెట్ వంటి ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. గోవాకు చెందిన 100 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధురాలు లిబయా లోబో సర్దేశాయ్‌తోపాటు తోలుబొమ్మలాట లాంటి కళలో విశేష సేవలందించిన భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతరను దేశంలోనే తొలిసారిగా పద్మ అవార్డులకు ఎంపిక చేశారు.
పద్మ అవార్డులు అందుకున్న 30 మంది ప్రముఖులు..
జోనస్ మాశట్టి(వేదాంత గురు) బ్రెజిల్
షేఖా ఏజేఎల్ సబాహ్(యోగా) కువైట్
నరేన్ గురుంగ్(జానపద గాయకుడు) నేపాల్
లిబియా లోబోసర్దేశాయ్(100 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధురాలు) గోవా
భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర(తోలుబొమ్మలాట) కర్ణాటక
భీమ్‌సింగ్ భవేష్(సామాజిక కార్యకర్త) బిహార్
జుమ్డే యోమ్‌గామ్ గామ్లిన్(సామాజిక కార్యకర్త) అరుణాచల్ ప్రదేశ్
రాధా బహిన్ భట్(సామాజిక కార్యకర్త) ఉత్తరాఖండ్
హర్వీందర్‌సింగ్ (పారాలింపియన్ గోల్డ్‌మెడల్ విన్నర్) హరియాణా
పి.దక్షిణామూర్తి (డోలు విద్వాంసుడు) పుదుచ్చేరి
బేరుసింగ్‌చౌహాన్ (జానపద గాయకుడు) మధ్యప్రదేశ్
వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) కర్ణాటక
బతూల్ బేగమ్ (జానపద కళాకారిణి) రాజస్థాన్
వేలు ఆసన్ (డప్పు వాద్యకారుడు) తమిళనాడు
జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు) అసోం
పాండిరామ్ మాండవి (కళాకారుడు) ఛత్తీస్‌గఢ్
ఎల్.హంగ్‌థింగ్ (వ్యవసాయం–పండ్లు) నాగాలాండ్
హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) హిమాచల్ ప్రదేశ్
విజయలక్ష్మి దేశ్‌మానే (వైద్యం) కర్ణాటక
విలాస్ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) మహారాష్ట్ర
నీర్జా భట్లా (గైనకాలజీ) ఢిల్లీ
సురేశ్ సోనీ (సోషల్‌వర్క్– పేదల వైద్యుడు) గుజరాత్
గోకుల్ చంద్ర దాస్ (కళలు) పశ్చిమ బెంగాల్
నిర్మలా దేవి (చేతి వత్తులు) బిహార్
సాల్లీ హోల్కర్ (చేనేత) మధ్యప్రదేశ్
పర్మార్ లావ్జీభాయ్ నాగ్జీభాయ్ (చేనేత) గుజరాత్
మారుతీ భుజరంగ్‌రావు చిటమ్‌పల్లి (సాంస్కృతికం, విద్య) మహారాష్ట్ర
చైత్రం దేవ్‌చంద్ పవార్ (పర్యావరణ పరిరక్షణ) మహారాష్ట్ర
జగదీశ్ జోషిలా (సాహిత్యం) మధ్యప్రదేశ్
హ్యూ, కొల్లీన్ గాంట్జర్ (సాహిత్యం, విద్య –ట్రావెల్) ఉత్తరాఖండ్
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Padma awards announced by central government
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com