Sonali Bendre: తెలుగు వారికి సుపరిచితమైన పేరు సోనాలి బింద్రే. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. మురారి, మన్మథుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఖడ్గం, పల్నాటి బ్రహ్మనాయుడు వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. తన నటనతో సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించింది. మొదట మోడలింగ్ గా చేసిన ఆమె ఆగ్ సినిమా ద్వారా హిందీలో రంగప్రవేశం చేసింది. కానీ తనకు బ్రేక్ ఇచ్చింది మాత్రం దిల్జాలే. అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన ఈ సినిమాతో సోనాలి బింద్రే భవిష్యత్ మారిపోయింది. బిజీ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పదేళ్ల పాటు హిందీలో పలు చిత్రాల్లో నటిస్తూ తన ప్రతిభను చాటుకుంది.

కానీ తరువాత విధి వెక్కిరించింది. క్యాన్సర్ బారిన పడింది. ఒక దశలో ఇల్లు గడవడమే కష్టంగా మారింది. దీంతో ఇంటి అద్దె కట్టడానికి కూడ డబ్బులు లేని పరిస్థితి. దీంతో చాలా ఇబ్బందులు పడింది. ఎలాగోలా ఎలాంటి పాత్రలయినా చేస్తూ తన కుటుంబాన్ని పోషించింది. దీంతో ఆమె ఓ ఇంటర్వ్యూలో కన్నీరు కార్చింది. తనకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదని బోరున విలపించింది. తానో స్టార్ గా ఉన్నా తనకు ఇలాంటి కష్టం రావడంతో కోలుకోలేదని విలపించింది.
Also Read: Manohari Song: మనోహరి పాటకు ఊపు ఊపిని యువతి.. హీరోయిన్లు వేస్టే.. వైరల్ వీడియో
2004 తరువాత గ్యాప్ తీసుకుని మళ్లీ 2013లో ఓ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. సినిమాలకు దూరమైనా దూరదర్శన్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోనే ఉంది. పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ అందరితో కలిసే ఉండేది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి పాత్రలు చేయడానికైనా ముందుకొచ్చేది. ఇల్లు గడవడానికే అలా చేయాల్సి వచ్చిందని చెబుతుండేది. అంతటి కష్టాలు పడిన నటి సోనాలి బింద్రే తన జీవితం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొందని తెలియజేస్తోంది.

డబ్బుల కోసం ఏ ప్రాజెక్టు వచ్చినా ఒప్పుకుంటూ కుటుంబాన్ని సాకేది. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఏ పాత్ర అయినా ఒప్పుకుని చేసేందుకు ఇష్టపడేవారు. అందుకే కొన్నాళ్ల పాటు చాలా ఇబ్బందులు పడ్డాం. సినిమా నటిగా గుర్తింపు పొందినా తనకు ఏం మిగలలేదు. అందుకే జీవితంలో చాలా వరకు కోల్పోయినా మనోధైర్యంతో ముందుకు నడిచి ఇప్పుడు నిలదొక్కుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో తనకు తానే ధైర్యం చెప్పుకుని ముందుకు నడిచా. ఎవరి అండ లేకున్నా ఇలా ఇప్పటికి సెటిల్ అయ్యానని చెబుతోంది. తెర వెనుక నటుల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో సోనాలి బింద్రే జీవితమే ఓ సాక్ష్యంగా నిలుస్తోంది.
Also Read:Chiranjeevi Daughter Sreeja: చిరంజీవి కూతురు ఇలా షాకిచ్చిందేంటి?
Recommended Videos



[…] Also Read: Sonali Bendre: అద్దె కట్టలేని సోనాలి బింద్రే అ… […]