Sonakshi Sinha: జహీర్ ఇక్బాల్ కి ముందు సోనాక్షి సిన్హా ఇంత మంది తో ప్రేమ వ్యవహారం నడిపిందా..?

Sonakshi Sinha: రెండేళ్ల నుంచి జహీర్ ఇక్బాల్ తో డేటింగ్ లో ఉంటున్నారు అంటూ చాలా వార్తలైతే వచ్చాయి. అయితే ఈ విషయం మీద ఆమె ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇపుడు అందుతున్న సమాచారం ప్రకారం...

Written By: Gopi, Updated On : June 15, 2024 12:40 pm

Sonakshi Sinha dating history

Follow us on

Sonakshi Sinha: రీసెంట్ గా సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో వచ్చిన ‘హిరామండి ‘ సిరీస్ తో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చిన నటి సోనాక్షి సిన్హా…ఈ ముద్దుగుమ్మ కెరియర్ మొదట్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు ఆమెకి ఉన్న క్రేజ్ అయితే చాలా వరకు తగ్గింది. ఇక ఈమె నటనకు గాను విమర్శకుల నుంచి ప్రశంసలు రావడంతో మరోసారి ఆమె బాలీవుడ్ లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆమెకు సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఇదిలా ఉంటే తను రెండేళ్ల నుంచి జహీర్ ఇక్బాల్ తో డేటింగ్ లో ఉంటున్నారు అంటూ చాలా వార్తలైతే వచ్చాయి. అయితే ఈ విషయం మీద ఆమె ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇపుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే వీళ్లు తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే సోనాక్షి సిన్హా కి జహీర్ ఇక్బాల్ మొదటి లవర్ కాదు ఆమె ఇంతకు ముందే ముగ్గురుని లవ్ చేసిందని బాలీవుడ్ మీడియా కొడైకొస్తుంది…వాళ్ళు ఎవరు అంటే

అమిత్ శర్మ దర్శకత్వంలో ‘తేవర్ ‘ అనే సినిమాలో సోనాక్షి అర్జున్ కపూర్ తో కలిసి నటించింది. ఇక ఈ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారట. అయితే ఆ తర్వాత అర్జున్ మలైకా తో ప్రేమలో పడడం వల్ల వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయినట్టుగా తెలుస్తుంది. నిజానికి సోనాక్షి సిన్హా అర్జున్ కపూర్ కంటే ముందే బంటి సజ్ దేవ్ తో ప్రేమలో పడిందని అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. ఇక సోహైల్ ఖాన్ మాజీ భార్య సీమా సజ్ దేవ్ సోదరుడే ఈ బంటి సజ్ దేవ్.. ఇక సోనాక్షి ఈయనతో డేటింగ్ కూడా చేసిందనే వార్తలైతే వినిపించాయి. ఇక ఒక దశలో వీళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారు అనే వార్తలైతే వచ్చాయి. ఇక ఏమైందో తెలియదు గానీ మొత్తానికైతే వీళ్ళ మధ్య బ్రేకప్ అయింది..

Also Read: Chiranjeevi: చిరంజీవి పవన్ కాంబో లో సినిమా కోసం ప్లాన్ చేస్తున్న బడా నిర్మాత…వర్కౌట్ అవుతుందా..?

ఇక సోనాక్షి సిన్హా అందరి కంటే ముందే ఆదిత్య షాఫ్రోన్ తో ప్రేమ వ్యవహారం నడిపిందని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక దబాంగ్ సినిమా తర్వాతే వీళ్ళ మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్టుగా తెలుస్తుంది. ఇక ఏమైందో తెలియదు గానీ వీళ్ళ మధ్యన ఉన్న ప్రేమ వ్యవహారాలు కూడా ఎక్కువ రోజులు నడవలేదు…

Also Read: Prabhas Heroine : ప్రభాస్ హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది… లేటెస్ట్ లుక్ చూస్తే షాక్ అవుతారు!

ఇక మొత్తానికైతే జహీర్ ఇక్బాల్ తో ప్రేమలో ఉన్న సోనాక్షి సిన్హా జూన్ 23వ తేదీన పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక వీళ్ళ పెళ్లి ముంబైలోని బాస్టియన్ రెస్టారెంట్ లో జరగబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక వీళ్ళ పెళ్లికి సంబంధించిన కార్డు కూడా చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళ పెళ్లికి ఎరుపు రంగు దుస్తులను ధరించి రాకూడదట. ఫార్మాల్ డ్రెస్ లో రావాలని వాళ్ళు కొరుకుంటున్నట్టుగా తెలుస్తుంది…