Chiranjeevi: చిరంజీవి పవన్ కాంబో లో సినిమా కోసం ప్లాన్ చేస్తున్న బడా నిర్మాత…వర్కౌట్ అవుతుందా..?

ఇండస్ట్రీలో ఎవరు గ్రీన్ కాంబినేషన్ అయిన చిరంజీవి పవన్ కళ్యాణ్ లా కాంబో లో ఒక మూవీ చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు.

Written By: Gopi, Updated On : June 15, 2024 9:07 am

Chiranjeevi

Follow us on

Chiranjeevi: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరోలు కూడా డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తూ వస్తున్నారు.. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఎవరు గ్రీన్ కాంబినేషన్ అయిన చిరంజీవి పవన్ కళ్యాణ్ లా కాంబో లో ఒక మూవీ చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు.

అయినప్పటికీ చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు గా తెలుస్తుంది. కానీ వాళ్ళ ఇమేజ్ కి సరిపడా కథ అయితే దొరకడం లేదట…ఇక ఇప్పటి వరకు చాలామంది చెప్పిన కథలను విన్న వీళ్ళిద్దరూ ఆ కథ లా విషయంలో కాంప్రమైజ్ అవ్వలేక సినిమాలు చేయడం లేదనే వార్తలైతే వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు బడ ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ కి వీళ్ళిద్దరితో మంచి సంబంధాలైతే ఉన్నాయి. కాబట్టి ఆ సన్నిహిత్యం తోనే వీళ్లిద్దరిని కలిపి ఒక సినిమా చేయడానికి తను ప్రణాళికను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఒకవేళ ఈ కాంబో నిజంగా వర్కౌట్ అయినట్టైతే అశ్విని దత్ ను చాలా మంది అభిమానులు ఆరాధిస్తారు. ఇక ఆయన నుంచి వచ్చే సినిమాలను కూడా ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడున్న సమయంలో అటు పవన్ కళ్యాణ్ ని, ఇటు చిరంజీవిని కలపడం చాలా కష్టం. ఎందుకంటే ఇద్దరు చాలా బిజీగా ఉన్నారు.

ఇక సినిమాలపరంగా చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఇక మీదట సినిమాలు చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన డిప్యూటీ సిఎం అవ్వడమే కాకుండా పలు శాఖలకు మంత్రి గా కూడా ఉన్నాడు. ఇక చిరంజీవి కూడా ప్రస్తుతం తన సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి ఏదైనా మంచి కథ దొరికి టైమ్ సెట్ అయితే తప్ప ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలైతే చాలా తక్కువ గా ఉన్నాయనే చెప్పాలి…