Amala Shaji: పాతికేళ్ల యువతి.. సోషల్ మీడియాలో రీల్స్.. ఖరీదైన కారు సొంతం చేసుకుంది..

అమల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కొత్త కొత్త పద్ధతుల్లో రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ ను అలరిస్తూ ఉంటుంది.. సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న ఈమె.. ఎన్నో పురస్కారాలు దక్కించుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 15, 2024 12:18 pm

Amala Shaji

Follow us on

Amala Shaji: సోషల్ మీడియా విస్తృతి పెరిగింది. ఇందులో రకరకాల ఫీచర్లు అందుబాటులోకి రావడంతో.. అవన్నీ ఔత్సాహికులకు ఆదాయ మార్గాలుగా మారాయి. వీటిని ఆధారంగా చేసుకొని చాలామంది యువతీ యువకులు సోషల్ మీడియాలో సత్తా చాటుతున్నారు. వీడియోలు, రీల్స్ చేస్తూ దండిగా సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో చెన్నైకి చెందిన అమల షాజీ యువతి ముందు వరుసలో ఉంటుంది.. ఇన్ స్టా గ్రామ్ లో అమల కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈమె వినూత్నంగా రీల్స్ చేస్తూ.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఆదాయం కూడా దండిగా ఉండడంతో.. ఇటీవల ఆమె ఒక కారు కొనుగోలు చేసింది. హ్యుందాయ్ కంపెనీ చెందిన ఎక్స్ టర్ కారుకు ఓనర్ అయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అమల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కొత్త కొత్త పద్ధతుల్లో రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ ను అలరిస్తూ ఉంటుంది.. సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న ఈమె.. ఎన్నో పురస్కారాలు దక్కించుకుంది.. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ అవతారం ఎత్తిన ఈమె.. కొన్ని కంపెనీలకు ప్రచారకర్తగా కూడా ఉంది.. వాటి వల్ల సంపాదన బాగుండడంతో ఓ కారు కొనుగోలు చేసింది. ఆ కారు డెలివరీ తీసుకునేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళింది.. ఆ శుభ సందర్భాన్ని ఫోటోల రూపంలో పంచుకుంది. కారు కొనుగోలు చేసినందుకు చాలా ఆనందంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. “ఇదంతా మీ అభిమానం వల్లే. మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఒక కారు కొనుగోలు చేయగలిగాను. ఇంతటి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. నా ప్రయాణం లో తోడున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఈ శుభ సందర్భంలో మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడం నా విధి. నన్ను అభిమానిస్తున్న, అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తున్నానని” అమల పేర్కొంది.

అమల కొనుగోలు చేసిన హ్యుందాయ్ ఎక్స్ టర్ విషయానికొస్తే.. మార్కెట్లోకి విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ మోడల్ విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంది.. ఎస్ యూ వీ 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఈ కారు సొంతం. ఇది 81.8 బీహెచ్ పీ పవర్, 113.8 న్యూటన్ మీటర్ టార్క్ ఈ మోడల్ కారులో లభిస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంది. ఈ కారు సీఎన్జీ మోడల్ లో కూడా లభిస్తుంది..ఎక్స్ టర్ మోడల్ మైలేజీ 19.4 కి.మీ/ లీ కు అందిస్తుంది. మనదేశంలోని రోడ్లకు అనుగుణంగా ఈ మోడల్ ను హ్యుందాయ్ రూపొందించింది.. ఈ మోడల్ ఆవిష్కరించిన అనతి కాలంలోనే వేలాదిగా బుకింగ్స్ నమోదు అయ్యాయని హ్యుందాయ్ పేర్కొంది..