మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో చేస్తున్న సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. కాబట్టి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం అవుతారు. అందులో ఒక హీరోయిన్ పాత్ర చాలా బలమైనది అట. అందుకే, ఆ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను తీసుకోవాలని చిత్రబృందం ప్లాన్ చేసింది.
మెగాస్టార్ సరసన సోనాక్షి సిన్హా నటిస్తే.. చూడటానికి చాలా బాగుంటుంది. అందుకే ఐడియా రాగానే దర్శకనిర్మాతలు వెంటనే ముంబై వెళ్లి మరీ సోనాక్షి సిన్హాకి కథ చెప్పారు. కథ సరిగ్గా వినకుండానే ఆమె సినిమా చేయడానికి అంగీకరించింది. కానీ, ఈ సినిమాలో నటించేందుకు ఏకంగా 4 కోట్ల రూపాయల పారితోషికాన్ని అడిగింది ఈ భారీ భామ.
అసలు సోనాక్షి సిన్హా అంత డిమాండ్ చేస్తోందని ఊహించని టీమ్.. ఆలోచించి చెబుతాం అని తిరిగి వచ్చేశారు. విషయం మెగాస్టార్ కి చేరింది. బాలీవుడ్ లో మన సినిమా మార్కెట్ కి సోనాక్షి స్టార్ డమ్ ఉపయోగ పడితే.. ఆమె అడిగినంత ఇవ్వండి అని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే, నిర్మాతలు మాత్రం ఇంకా బెటర్ ఆప్షన్ కోసం చూస్తున్నారు. ఒకవేళ ఎవరు దొరక్కపోతే సోనాక్షిని ఫైనల్ చేస్తారట.
కాగా దసరాకు ఈ సినిమా అధికారికంగా లాంచ్ కానుంది. కాకపోతే, మెగా అభిమానుల్లో మాత్రం ఈ సినిమా పై అంతృప్తి ఉంది. అసలు మెగాస్టార్ కి, బాబీ లాంటి ఏవరేజ్ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేయాల్సిన అవసరం ఏమిటి ? అంటూ పెదవి విరుస్తున్నారు. మెగా ఫ్యాన్స్ బాధలో నిజం ఉంది. బాబీ స్టార్ హీరోలతో సినిమాలు చేసినా.. డైరెక్టర్ గా ఎలాంటి స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయాడు.
మరి అలాంటి దర్శకుడికి మెగాస్టార్ ఎందుకు ఛాన్స్ ఇచ్చినట్లు అనేది అభిమానుల డౌట్. చిరు గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ.. కొత్త దర్శకులతో కూడా పని చేయడానికి తాను సిద్ధం అంటున్నారు. ఈ నేపథ్యంలోనే చిరు, బాబీకి అవకాశం ఇచ్చారు. అయినా స్టార్ హీరోలను ఒప్పించి సినిమాలు చేయడంలో బాబీకి బాగా అనుభవం ఉంది లేండి.