
ఏపీ డిజిటల్ హెల్త్ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శ్రీ కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాల డేటా.. క్యూఆర్ కోడ్ రూపంలో అందుబాటులో ఉండాలని సూచించారు. విలేజ్ క్లినిక్స్ లో కూడా డేటా వివరాలు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. 104 వాహనాలు గ్రామాలకు వెళ్లేసరికి, వ్యక్తి ఆరోగ్య వివరాలు డాక్టర్ కు తెలిసేలా ఉండాలన్నారు. షుగర్, బీపీ, బ్లడ్ గ్రూప్ వివరాలు కార్డులో నిక్షిప్తం చేయాలని సూచించారు. విలేజ్ క్లినిక్స్ లో సాధారణ పరీక్షలు చేసే పరిస్థితి ఉండాలని ఆదేశించారు.