Son Of India Collections: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’కి కలెక్షన్లు చాలా దారుణంగా వచ్చాయి. మోహన్ బాబు సినీ కెరీర్ లోనే ‘సన్నాఫ్ ఇండియా’ భారీ డిజాస్టర్ గా నిలిచింది. 353 థియేటర్స్ లో రిలీజ్ చేస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఓపెనింగ్స్ పరంగా భారీగా నిరాశ పరిచింది. చాలా చోట్ల జనాలు లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి.
మొత్తమ్మీద సన్ ఆఫ్ ఇండియా నిర్మాతలను షేక్ చేసే వసూళ్లు వచ్చాయి. పెద్ద సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. ఇక సన్ ఆఫ్ ఇండియా కథ ముగిసినట్టే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అతి తక్కువ వసూళ్లు రాబట్టిన స్టార్ సినిమాగా నిలవడం విచారకరం. కాగా, కేవలం 10 లక్షల గ్రాస్ వచ్చిందని టాక్.
Also Read: బాక్సాఫీస్ బద్దలు.. భీమ్లానాయక్ 4వ రోజు కలెక్షన్స్ షాకింగ్
ఈ లెక్కన థియేటర్ రెంటు కూడా వచ్చుండదు అంటున్నారు. పైగా షోలు పడిన చోట ఆక్యుపెన్సీ కేవలం 2-3% వరకు మాత్రమే వచ్చింది అట. కొన్ని చోట్ల అయితే.. పోస్టర్ల డబ్బులు కూడా రాలేదు అట. ఒక విధంగా ఇది అతి పెద్ద అవమానం. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా కోసం ప్రేక్షకులు కనీస ఆసక్తి చూపించలేదు.
ఇంత దారుణంగా ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి లేదు. అసలు మోహన్ బాబుకి కలెక్షన్ కింగ్ అని పేరు ఉంది. ఆ పేరుకి ఈ సినిమాకి కలెక్షన్స్ కి ఎక్కడా పొంతన లేకుండా పోయింది. ఏది ఏమైనా చాలా చోట్ల ఒక్కరు కూడా టికెట్ బుక్ చేసుకోకపోవడం కచ్చితంగా విచిత్రమే.