Manchu Vishnu: మా అధ్యక్షుడు, సినీ నటుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగింది. రూ.5లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీకి గురయ్యాయి. హెయిర్ డ్రెసర్ నాగ శ్రీనుపై అనుమానం వ్యక్తం చేస్తూ మంచు విష్ణు, కార్యాలయ మేనేజర్ సంజయ్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, మొత్తానికి మంచు విష్ణు కార్యాలయం వార్తల్లో నిలిచింది.
అసలు మంచు విష్ణు ఈ మధ్య మరీ కామ్ అయిపోయాడు. `మా` ఎన్నికలకు ముందు, మీడియా ముందు హైలైట్ కావడానికి నానా అగచాట్లు పడిన మంచు బాబు.. ఎన్నికల అనంతరం ‘ఇటు కర్ర విరక్కుండా, అటు పాము చావకుండా’ అన్నట్టు బిహేవ్ చేస్తూ వస్తున్నాడు. `మా` అధ్యక్షుడు అయ్యాక మంచు విష్ణు ఇప్పటివరకు చేసింది ఏమిటి ? అని ఆలోచిస్తే.. ఏమి లేదు.
Also Read: పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో మరోసారి ఘనంగా తెలిసింది
ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏ సమస్య పై ఏ ఒక్కరో మాట్లాడితే ఆ సమస్య పరిష్కారం కాదని చెప్పిన విష్ణు.. మరి తాను ఇచ్చిన హామీలను కూడా అందరూ కలిసి నెరవేర్చాలి అంటాడేమో. నిజానికి టికెట్ల విషయంలో ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి వచ్చింది ఒక్క మంచు ఫ్యామిలీ తప్ప. దీనిబట్టి మా అధ్యక్షుడిగా విష్ణు ఎంతవరకు కరెక్ట్ ? మంచు విష్ణు ఇప్పటికైనా కనీస బాధ్యత వహించాలి.
లేదంటే.. ఇంకా ట్రోలింగ్ కి గురి కావాల్సి వస్తోంది. అయినా మాట నిలబెట్టుకునే పరిస్థితి విష్ణుకు ఉంది అని అనుకోలేం. విష్ణు సినిమాలకు మార్కెట్ ఎప్పుడో పోయింది. కాబట్టి.. విష్ణు ఈవెంట్స్ చేస్తే డబ్బులు రావు. పోనీ, స్టార్లను అయినా తీసుకొచ్చి ఏమైనా ఈవెంట్లు చేస్తాడా ? అంటే.. ఇగో సమస్య అయ్యే. కాబట్టి, మంచు విష్ణు ఆలోచన ఆచరణలో సాధ్యం కాదు.
తాను ఇచ్చిన హామీలను అమలుపరచాలని మంచు విష్ణు తాపత్రయపడినా అవి పూర్తి స్థాయిలో అమలు కావు. విష్ణు ఇప్పటివరకు ఇచ్చిన హామీలలో ఏదైనా చేశాడు అంటే.. నటీనటుల పై అనవసరమైన పుకార్లను పుట్టిస్తోన్న యూ ట్యూబ్ ఛానల్స్ పై దృష్టి సారించాడు. కానీ వాటిని ఏ విధంగానూ ఆపలేకపోయాడు. మొదటి పనిలోనే అపజయం చెందిన విష్ణు బాబు, ఇక భవిష్యత్తులో విజయం సాధిస్తాడా ? ఎలా నమ్మగలం ?
Also Read: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ అతని జీవిత కథే