Chanakya Niti:చాణిక్యుడు తన నీతి గ్రంథం ద్వారా ఒక మనిషి ఎదుగుదలకు కావలసిన ఎన్నో అద్భుతమైన విషయాలు గురించి ఎంతో అద్భుతంగా వివరించారు.ఈ క్రమంలోనే ఒక మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాలను గురించి చాణిక్యుడు నీతి గ్రంధం ద్వారా వివరించారు. ఈ క్రమంలోని ఈయన నీతి లక్షణాలను అవలంభించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పడానికి ఏమాత్రం సందేహం పడాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే చాణక్యుడు తన నీతి గ్రంథం ద్వారా భర్త తన జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే భార్యలు ఈ 4 లక్షణాలు కలిగి ఉండాలని ఎంతో అద్భుతంగా తెలిపారు. మరి భార్యలో ఉండాల్సిన ఆ నాలుగు లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

ప్రశాంత స్వభావం: చాలామంది ప్రతి చిన్న విషయానికి కోపం వ్యక్తం చేస్తుంటారు. ఇలా కోపం వ్యక్తం చేయటం వల్ల తన చుట్టూ ఉన్న బంధాలను దూరం చేసుకుంటారు. అందుకే ప్రశాంతమైన స్వభావం కలిగి ఉండాలి ఇలా ప్రశాంత స్వభావం కలిగి ఉన్న వారిపై ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది అందుకే ఎల్లప్పుడూ ప్రశాంతంగా శాంతియుతంగా ఉన్న మహిళ భార్యగా వస్తే ఆ భర్తకు అన్ని శుభాలే.
సంతృప్తి: ఒక మనిషి ఎదుగుదలకు కావలసిన వాటిలో సంతృప్తి ఒకటి. ఇంకా సంపాదించాలని అత్యాశకు పోయి అది మనల్ని మరింత దిగజారుస్తుంది. అందుకే మనకు వచ్చిన దానిలో సంతృప్తి చెందుతూ జీవితంలో విజయం వైపు వెళ్లడానికి ప్రయత్నించాలి. అందుకే ఇలాంటి సంతృప్తి స్వభావం కలిగిన భార్య భర్తకు తోడుగా ఉంటే ఎలాంటి సమయంలోనైనా వీరు జీవితంలో ముందుకు రాగలుగుతారు.
మధురమైన వాక్కు: భార్య ఎప్పుడు గల గల కోపంగా కఠినంగా మాట్లాడేది కాకుండా మధురమైన వాక్కు కలిగినది అయితే ఆ భర్తకు నిజంగా అదృష్టం. ఈ విధమైనటువంటి సుగుణం కలిగిన మహిళను పెళ్లి చేసుకోవడం వల్ల ఆ భర్త ఎంతో అదృష్టవంతుడు అవుతాడు.
సహనం: భార్య భర్తల జీవితంలో సహనం అనేది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఎలాంటి కష్ట సుఖాలలో అయినా సహనంతో ఉన్న భార్య ఉన్నప్పుడే ఆ భర్తకు మంచి కలుగుతుంది. అందుకే సహనం ఉన్న భార్య దొరకడం నిజంగా భర్తకు అదృష్టమని చాణిక్యుడు తన నీతి గ్రంథం ద్వారా తెలిపారు.
Recommended Video:
