https://oktelugu.com/

కరోనా పెరుగుతున్నా .. షూటింగ్ స్టార్ట్ చేశాడు ! 

సాయి ధరమ్ తేజ్ కి మొత్తానికి  ‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ లాంటి విజయాలతో బాక్సాఫీస్ వద్ద  బాగానే కాలం కలిసొచ్చింది.  ప్రస్తుతం  ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే కరోనా ఇంకా రోజురోజుకూ  పెరుగుతున్నా.. సాయి తేజ్ మాత్రం ఈ రోజు సైలైంట్ గా షూటింగ్ ను మొదలుపెట్టేశాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ రోజు నుండి ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ రోజు సాయి తేజ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 31, 2020 / 06:06 PM IST
    Follow us on

    సాయి ధరమ్ తేజ్ కి మొత్తానికి  ‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ లాంటి విజయాలతో బాక్సాఫీస్ వద్ద  బాగానే కాలం కలిసొచ్చింది.  ప్రస్తుతం  ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే కరోనా ఇంకా రోజురోజుకూ  పెరుగుతున్నా.. సాయి తేజ్ మాత్రం ఈ రోజు సైలైంట్ గా షూటింగ్ ను మొదలుపెట్టేశాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ రోజు నుండి ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ రోజు సాయి తేజ్ మీద కొన్ని ఎమోషనల్ గా సాగే  సోలో షాట్స్ తీసినట్లు తెలుస్తోంది.
    ఇక ‘సాయి తేజ్’ ఇండస్ట్రీలోకి ‘పిల్లా.. నువ్వులేని జీవితం’ అనే సూపర్ హిట్ సినిమాతోనే గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే  మెగా సుప్రీమ్ హీరోగా  పేరు తెచ్చుకున్నాడు. ఒక దశలో స్టార్ హీరో అయ్యేలా కనిపించిన తేజ్, ఆ తరువాత మాత్రం బాక్సాఫీస్ వద్ద వరుసగా  ఆరు డిజాస్టర్  లతో పూర్తిగా తేలిపోయాడు. దాదాపు ఐదేళ్ళు ప్లాప్ హీరోగా బాగా సతమతమయ్యాడు.  సుప్రీమ్’ సినిమా త‌ర్వాత చేసిన ‘తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు’ ఇలా సాయి తేజ్  నటించిన వరుస సినిమాలన్నీ  అత్యంత భారీ ప్లాప్ సినిమాలే.
    నిజానికి ఈ సినిమాల్లో ఏ సినిమా హిట్ అయినా, గీతగోవిందం సినిమా సాయి తేజ కి వచ్చేది. కేవలం ప్లాప్ ల్లో ఉన్నాడనే కారణంతోనే ఆ సినిమా మిస్ అయింది. ఏది అయితేనేం ఆరు డిజాస్టర్‌ ల దెబ్బకి  ‘షేర్ మార్కెట్’లా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన తన సినిమా మార్కెట్ రేంజ్ ను  ‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ సినిమాలతో మళ్ళీ నిలబెట్టుకున్నాడు.  ప్రస్తుతం  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’ సినిమాలో నటిస్తున్నాడు.