https://oktelugu.com/

బాలయ్య మంత్రం.. కరోనా పరార్ అవాల్సిందే?

దివంగత మహానటుడు ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ రూటే సపరేటు.. ఈ విషయం అందరికీ తెల్సిందే. ఆయన సినిమాలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఎవరికీ సాధ్యంకానీ పనులన్నీంటి బాలయ్యే ఒక్కడే చేసేస్తుంటాడు. ఆయన ఫ్యాన్స్ కూడా వీటిని తెగ ఎంజాయ్ చేస్తుంటారు.. అయితే ఆయన సినిమాలకు.. వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం పోలికలేదని బాలయ్య చాలాసార్లు నిరూపించారు. Also Read : జగన్ చేతకాని తనమే ఏపీ దుస్థితికి కారణమంటున్న ఆర్కే? బాలయ్య మ్యానరిజం కూడా చాలా సేపరేట్ గా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 31, 2020 / 05:37 PM IST
    Follow us on


    దివంగత మహానటుడు ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ రూటే సపరేటు.. ఈ విషయం అందరికీ తెల్సిందే. ఆయన సినిమాలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఎవరికీ సాధ్యంకానీ పనులన్నీంటి బాలయ్యే ఒక్కడే చేసేస్తుంటాడు. ఆయన ఫ్యాన్స్ కూడా వీటిని తెగ ఎంజాయ్ చేస్తుంటారు.. అయితే ఆయన సినిమాలకు.. వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం పోలికలేదని బాలయ్య చాలాసార్లు నిరూపించారు.

    Also Read : జగన్ చేతకాని తనమే ఏపీ దుస్థితికి కారణమంటున్న ఆర్కే?

    బాలయ్య మ్యానరిజం కూడా చాలా సేపరేట్ గా ఉంటుంది. ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారని.. నచ్చితే నొత్తిన పెట్టుకుంటారు.. నచ్చకపోతే ఏమాత్రం పట్టించుకోరు.. అంతేకాకుండా బాలయ్య అధ్యాత్మిక భావాలు ఎక్కువ. ఎప్పుడు చూసిన పురణాల గురించి.. పద్యాల గురించి ప్రస్తావిస్తుంటారు. ఇక ఆయన మాటల్లో ఎక్కువగా ‘ఆరోజుల్లో నాన్నగారు.. నందమూరి వంశం’ టాపిక్ లే విన్పిస్తుంటాయి.

    ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతోన్నారు. కరోనా కారణంగా గత ఐదునెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న బాలకృష్ణ సోమవారం హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఏపీకి రాజధాని లేకునప్పటికీ తెలంగాణ కంటే ఎక్కువ ఆదాయం వచ్చిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి కంటే కేవలం కక్ష సాధింపులే ఎక్కువగా కన్పిస్తున్నాయన్నారు. అభివృద్ధిలో ప్రభుత్వం అందరినీ కలుపుకోవాలని సూచించారు.

    Also Read : ‘జీఎస్టీ’పై జగన్ కు మరోదారి లేదా?

    ఇక హిందూపురం నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సీఎం జగన్ కు లేఖరాశానని.. అవసరమైతే ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తానని చెప్పారు. తన నియోజకవర్గంలో సొంత నిధులతో నిర్మిస్తున్న కోవిడ్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రికి రూ.55లక్షల విలువ చేసే వైద్య పరికరాలు, మందులు పంపిణీ చేశారు.

    నియోజకవర్గంలో ఘనస్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి బాలయ్య వారికి కరోనా మంత్రం పఠించాలని సూచించారు. ‘అస్మిన్ పరాత్మన్ నను పాదకల్పే త్వమిత్థముత్థాపిత పద్మయోనిః అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస ! విష్ణో!’  అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కరోనా రాదన్నారు. ప్రజలంతా ఈ మంత్రాన్ని పఠించాలని సూచించారు. దీంతో బాలయ్య మంత్రం వేస్తే.. కరోనా ఏంటీ.. దానమ్మ మొగుడైనా పరార్ కావాల్సిందేననే సెటైర్లు విన్పిస్తున్నాయి.

    Also Read : జగన్ దగ్గరకు పోతా అంటున్న బాలయ్య… బాబు తట్టుకోగలడా?