https://oktelugu.com/

సోహెల్ సినిమా మొదలైంది.. మెగాస్టార్ ఏమంటారో ?

అదృష్టం ఉంటే అంతే మరి.. అన్ని అలా కలిసివచ్చేస్తాయి. ‘బిగ్ బాస్ సీజన్ 4’తో అభిమానుల మనసులు కొల్లగొట్టిన సయ్యద్ సోహెల్ ను ప్రస్తుతం అదృష్టం పట్టుకుంది. బిగ్ హౌస్ లోకి వెళ్ళకముందు సోహెల్ కొన్ని సినిమాల్లో నటించినా ఎవ్వరికి తెలియదు. కానీ బిగ్ బాస్ పుణ్యమా అని.. హీరోగా అవకాశాలు సోహెల్ ను వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజగా సోహెల్ హీరోగా కొత్త సినిమాని మొదలైపోయింది. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెజర్ కుక్కర్’ వంటి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ […]

Written By:
  • admin
  • , Updated On : December 26, 2020 / 10:59 AM IST
    Follow us on


    అదృష్టం ఉంటే అంతే మరి.. అన్ని అలా కలిసివచ్చేస్తాయి. ‘బిగ్ బాస్ సీజన్ 4’తో అభిమానుల మనసులు కొల్లగొట్టిన సయ్యద్ సోహెల్ ను ప్రస్తుతం అదృష్టం పట్టుకుంది. బిగ్ హౌస్ లోకి వెళ్ళకముందు సోహెల్ కొన్ని సినిమాల్లో నటించినా ఎవ్వరికి తెలియదు. కానీ బిగ్ బాస్ పుణ్యమా అని.. హీరోగా అవకాశాలు సోహెల్ ను వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజగా సోహెల్ హీరోగా కొత్త సినిమాని మొదలైపోయింది. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెజర్ కుక్కర్’ వంటి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ అప్పి రెడ్డి తన మూడో సినిమాని సోహెల్ తో ప్రకటించారు.

    Also Read: రజినీకాంత్ కు తెలుగు సినిమా పెద్దల బాసట.. చూసుకుంటున్న మోహన్ బాబు

    కాగా సయ్యద్ సోహెల్ హీరోగా కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడిగా ఆయన కొత్త సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అప్పి రెడ్డి మాట్లాడుతూ “ఈ సబ్జెక్ట్ సెన్సేషన్ క్రేయేట్ చేస్తుంది. నాకు తెలిసి ఇండియాలో ఇటువంటి కాన్సెప్ట్ మూవీ రాలేదు. సోహైల్ తో మేము బిగ్ బాస్ కంటే ముందే కలసి మాట్లాడడం జరిగింది. బిగ్ బాస్ ద్వారా సోహైల్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు అయిపోయాడు. సోహైల్ కు ఇది బిగ్ గేమ్ చేంజర్ అవుతుంది,” అని నిర్మాత అప్పిరెడ్డి చెప్పుకొచ్చారు.

    Also Read: సింగర్ సునీత ప్రీవెడ్డింగ్ పార్టీ.. కేరాఫ్ ఆఫ్ ‘గచ్చిబౌలి’

    అంటే సోహెల్ బిగ్ బాస్ లోకి వెళ్ళకముందే అప్పిరెడ్డి ఆయనతో సినిమా చేయాలనుకున్నాడు అన్నమాట. సోహెల్ కూడా ఈ సినిమా పట్ల తెగ ఉత్సాహం చూపిస్తున్నాడు. “నేను బిగ్ బాస్ కు వెళ్లకముందు కొన్ని సినిమాలు చేశాను. కానీ అవేవీ నాకు సరైన గుర్తింపునివ్వలేదు. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఎలాంటి మూవీ చేస్తానా అని అందరూ ఎదురుచూస్తున్నారు. నిజంగానే ఈ కథ వేరేగా ఉంటది, అంటూ సోహెల్ ఈ సినిమా పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి మాట ఇచ్చినట్లు ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తారా ? చిరు కోసం ఓ మంచి క్యారెక్టర్ ను అనుకున్నాడట దర్శకుడు. మరి చూడాలి చిరు ఏమంటాడో ?

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్