డిసెంబర్ 30న సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో భేటి కాబోతున్నారు. ఉద్యోగుల డిమాండ్లు.. పీఆర్సీకి సంబంధించిన నివేదికపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. ఈమేరకు ఉద్యోగ సంఘాలతో భేటి అనంతరం కేసీఆర్ కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: గుప్‌కార్ కూటమికి స్నేహ ‘హస్తం’
గడిచిన రెండు మూడేళ్లుగా ఉద్యోగులు కొత్త పీఆర్సీ అమలు చేయాలని కోరుతున్నాయి. 2018 నుంచి ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కూడా పాత పీఆర్సీనే కొనసాగుతోంది.
ప్రభుత్వం 2021 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయనుందని సమాచారం. దీంతో ఉద్యోగులు రెండేళ్ల పీఆర్సీ కొల్పోయే అవకాశం కన్పిస్తోంది. దీనిపై ఉద్యోగులు ఎలా రియాక్టవుతారనేది ఆసక్తిని రేపుతోంది.
దీనికితోడు ఉద్యోగులు ఫిట్ మెంట్ 63శాతం కోరుతుండగా ప్రభుత్వం 33శాతం ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్.. కనీస వేతనంపై కేసీఆర్ కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: ఇక నుంచి గ్రామాల్లోనే ఉండాలి..: టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
ఇప్పటిదాకా కనీస పెన్షన్ రూ. 6,500 ఉండగా దీనిని రూ. 10 వేలకు పెంచనున్నారు. కనీస వేతనం 15 వేలుగా ఉండగా దాన్ని రూ. 20 వేలకు పెంచేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జనాభా ప్రాతిపదికన కాకుండా జిల్లా కేంద్రాల ప్రతిపాదికన ఉద్యోగులకు 20శాతం హెచ్ఆర్ఏను అమలు చేయనున్నారు. పదవీ విరమణ గ్రాట్యుటీ ఇప్పటి వరకు 12 లక్షలు ఉండగా దానిని 18లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్