https://oktelugu.com/

సోహైల్ తొందరపాటు నిర్ణయం…

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కాగా ఐదుగురు ఫైనలిస్ట్స్ ఎవరు టైటిల్ కొడతారనే ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం విజేత నిర్ణయం కానుంది. కాగా ఇప్పటికే తక్కువ ఓట్లు పొందిన అరియనా, హారిక టైటిల్ రేసు నుండి తప్పుకున్నారు. అరియనా నాలుగవ స్థానం పొందగా, హారిక అందరికంటే తక్కువ ఓట్లు పొంది చివరి స్థానంలో నిలిచింది. దీనితో బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ కూడా మేల్ కంటెస్టెంట్ దే అని రుజువైంది. కాగా బిగ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 21, 2020 / 10:23 AM IST
    Follow us on


    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కాగా ఐదుగురు ఫైనలిస్ట్స్ ఎవరు టైటిల్ కొడతారనే ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం విజేత నిర్ణయం కానుంది. కాగా ఇప్పటికే తక్కువ ఓట్లు పొందిన అరియనా, హారిక టైటిల్ రేసు నుండి తప్పుకున్నారు. అరియనా నాలుగవ స్థానం పొందగా, హారిక అందరికంటే తక్కువ ఓట్లు పొంది చివరి స్థానంలో నిలిచింది. దీనితో బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ కూడా మేల్ కంటెస్టెంట్ దే అని రుజువైంది. కాగా బిగ్ బాస్ లో ఓ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది.

    Also Read: బిగ్ బాస్ లీక్: విన్నర్, రన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది!

    అరియనా, హారికల నిష్క్రమణతో టైటిల్ కోసం అభిజీత్, అఖిల్ మరియు సోహైల్ పోటీపడ్డారు. ఈ ముగ్గురిలో అభిజీత్ టాప్ టూకి చేరడం జరిగింది. టాప్ టాప్ టూ స్థానం కోసం అఖిల్ మరియు సోహైల్ మధ్య పోటీ ఏర్పడింది. అఖిల్ మరియు సోహైల్ ఒకరు టాప్ టూకి వెళ్ళతారని హోస్ట్ నాగార్జున చెప్పారు. టాప్ టూ కి వెళ్ళబోయేది ఎవరో తెలిసేలోపు రూ. 25 లక్షలు తీసుకొని నిష్క్రమించవచ్చని చెప్పారు. ఈ ఆఫర్ తీసుకోవాలా లేదా అని ఇద్దరి మధ్య కొంత సందిగ్దత కొనసాగింది.

    Also Read: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4 .. గెలుపు ఎవరిది..?

    చివరకు సోహైల్ రూ. 25 లక్షలు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకుంటానని చెప్పాడు. దీనితో టాప్ టూ కి అభిజీత్ మరియు అఖిల్ చేరుకొని టైటిల్ కోసం పోటీపడ్డారు. అనూహ్యంగా ఓటింగ్ ప్రకారం అఖిల్ కంటే ముందున్న సోహైల్ టాప్ టూ పొజిషన్ చేజార్చుకున్నాడన్న టాక్ నడిచింది. సోహైల్ డబ్బులు తీసుకొని నిష్క్రమించడంతో అఖిల్ టైటిల్ పోరు కోసం అభిజీత్ తో కలిసి స్టేజీ మీదకు వచ్చాడు.  చివరకు అభిజీత్ విన్నర్ గా నిలవడంతో అఖిల్ రన్నరప్ కు పరిమితం కావాల్సి వచ్చింది. ట్విస్ట్ ఏంటంటే విన్నర్ అభిజిత్ కు రూ.25 లక్షలు.. 3వస్థానంలో నిలిచిన సోహైల్ కు కూడా రూ.25 లక్షలే దక్కడం కొసమెరుపు. దీంతో విజయం సాధించిన అభిజిత్ కు పూర్తి ఆనందం లేకుండా పోయింది..

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్