జగన్‌, బాబులకు బీజేపీ చెక్‌ పెట్టబోతోందా..?

వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది బీజేపీ. ఆ దిశగా కత్తులు నూరుతూనే ఉన్నారు. పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి సారించారు. ముఖ్యంగా వైసీపీ ఎక్కడెక్కడైతే బలంగా ఉందో.. ఆయా జిల్లాలను టార్గెట్‌ చేసింది. వైసీపీకి ప్రధానంగా రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉంది. ఇక ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో మాత్రం టీడీపీ హవా నడుస్తోంది. రాయలసీమలో మాత్రం టీడీపీ పలుకుబడి తగ్గుతూ వస్తోంది. Also Read: ఆంధ్ర భూ సర్వే కు.. […]

Written By: Srinivas, Updated On : December 21, 2020 1:42 pm
Follow us on


వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది బీజేపీ. ఆ దిశగా కత్తులు నూరుతూనే ఉన్నారు. పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి సారించారు. ముఖ్యంగా వైసీపీ ఎక్కడెక్కడైతే బలంగా ఉందో.. ఆయా జిల్లాలను టార్గెట్‌ చేసింది. వైసీపీకి ప్రధానంగా రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉంది. ఇక ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో మాత్రం టీడీపీ హవా నడుస్తోంది. రాయలసీమలో మాత్రం టీడీపీ పలుకుబడి తగ్గుతూ వస్తోంది.

Also Read: ఆంధ్ర భూ సర్వే కు.. తెలంగాణ భూసర్వేకు తేడా ఇదే?

ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీకి ఎక్కడ పట్టు ఉందో ఇప్పటిదాకా ఆ పార్టీకే అర్థం కాని పరిస్థితి. కాస్తో కూస్తో బలం ఉంటే గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రా ముఖ ద్వారం విశాఖలో బీజేపీకి ఉందని గత విజయాలు రుజువు చేశాయి. వీటిని కాపాడుకుంటూనే కొత్త స్థానాల్లో బలపడాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. జగన్‌కు పట్టున్న సీమ జిల్లాల్లో పాగా వేయడానికి చూస్తూనే టీడీపీకి చోటున్న కోస్తా ఉత్తరాంధ్రా జిల్లాల మీద కూడా బీజేపీ కన్ను వేసింది.

Also Read: జగన్ కు బర్త్ డే కానుకగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రోజా

తిరుపతి నుంచే బీజేపీ రాజకీయ అజెండా అమలు చేయడానికి రంగం సిద్ధం చేశారట. ఇక్కడ హిందూ కార్డు వర్కౌట్ అవుతుందని బీజేపీ ఆలోచన. పైగా చిత్తూరు, కడప, కర్నూలు వంటి చోట్ల మైనారిటీలు పెద్ద ఎత్తున ఉన్నారు. అలాగే క్రిస్టియన్ మైనారిటీల హవా కూడా అనంతపురం కడప వంటి చోట్ల ఉంది. దాంతో హిందూ కార్డుతో అక్కడ బలంగా ఢీకొడితే బలమైన రెడ్డి సామాజికవర్గంతో అమీ తుమీ తేల్చుకోవచ్చునని బీజేపీ భావిస్తోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఇప్పుడు బీజేపీకి బాగా కలసి వస్తోంది. అక్కడ ఊపు చూపిస్తే రాయలసీమలో పాతుకుపోవడానికి అదే తొలి మెట్టు అవుతుందని కూడా బీజేపీ ఆలోచిస్తోందట.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

గోదావరి జిల్లాల్లో కాపులను దరి చేర్చుకుంటూనే ఉత్తరాంధ్రాలో బీసీలను దగ్గరకు తీస్తే టీడీపీ ఓటు బ్యాంక్‌కు చిల్లు పెట్టడానికి బీజేపీ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రాలో పట్టున్న బీసీ నేతలను చేర్చుకోవడానికి బీజేపీ అడుగులు వేస్తోంది. మరోవైపు కృష్ణా, గుంటూరులలో రాజకీయం మొత్తం అమరావతి రాజధాని మీదనే ఆధారపడి ఉంది. జగన్ ఎంతలా మూడు రాజధానులు అంటూ దూకుడు చేసినా అసలైన ట్రంప్ కార్డ్ బీజేపీ చేతిలోనే ఉంది. దాన్ని సమయానుకూలంగా వాడుకుంటే ఈ జిల్లాలు దాసోహం అంటాయన్నది బీజేపీ మరో ఎత్తుగడ. మొత్తంగా చూస్తే.. వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి నుంచే బీజేపీ సమాయత్తం అవుతుండడం ఒక ఎత్తయితే.. అటు చంద్రబాబు, ఇటు జగన్‌ను కూడా టార్గెట్‌ చేసి ఆ పార్టీలను బలహీనపర్చాలనే చూస్తున్నట్లు కనిపిస్తోంది.