Akkineni Nagarjuna : ఎన్ కన్వెన్షన్ మీద వచ్చిన డబ్బుల మీద కేసు వేసిన సామాజిక వేత్త…దీని మీద నాగ్ స్పందన ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగేశ్వరరావు, ఎన్టీయార్ లను రెండు కండ్లుగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్లు సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలు అంతా ఇంతా కాదు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే డామినేషన్ ని తట్టుకొని మరి సినిమా ఇండస్ట్రీ ఉనికిని కాపాడారు అంటే వాళ్ల లాంటి లెజెండరీ డైరెక్టర్ మరొకరు ఉండరు అనేది వాస్తవం...

Written By: Gopi, Updated On : October 9, 2024 1:05 pm

Akkineni Nagarjuna N Convention

Follow us on

Akkineni Nagarjuna :  కింగ్ నాగార్జున తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక నాగేశ్వరరావు తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి రెండో తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా విలక్షణ నటుడుగా కూడా మంచి పేరునైతే సంపాదించుకున్నాడు. ఇక తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో రకాల పాత్రలను పోషించిన ఆయన ఇప్పుడు తన 100 వ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ తన పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తన కొడుకులతో పాటు తనకి కూడా ఒక్క సక్సెస్ అయితే దక్కడం లేదు.

సినిమా కెరియర్ అనే కాకుండా పర్సనల్ విషయాల్లో కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆయనకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి… ఇక చెరువుని ఆక్రమించుకొని ఎన్ కన్వెన్షన్ హాలును నిర్మించాడు అంటూ తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో దానిని కూల్చివేసిన విషయం మనకు తెలిసిందే.

అయితే చాలా సంవత్సరాల నుంచి ఎన్ కన్వెన్షన్ మీద చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వాన్ని నాగార్జున మేనేజ్ చేస్తూ వస్తున్నాడంటూ వార్తలు కూడా వినిపించాయి. కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి సర్కార్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాలిని కూల్చివేయడంతో అది మరొక చర్చకు దారితీసింది. ఇక ఇదిలా ఉంటే నాగార్జునకు దానిమీద కొన్ని కోట్ల ఆదాయం వస్తుండేది. సాధారణంగా హైదరాబాదులో సెలబ్రిటీల పెళ్లి జరగాలంటే ఎన్ కన్వెన్షన్ హాల్ అందరికి అందుబాటులో ఉండేది. కాబట్టి వాళ్ళందరూ దాన్నే వాడుకునేవారు. దానిమీద నాగార్జున ఇప్పటికే కొన్ని వందల కోట్లు సంపాదించారంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

మరి చెరువును ఆక్రమించి కట్టిన కట్టడం మీద నాగార్జున అన్ని వందల కోట్లు ఎలా కలెక్ట్ చేస్తాడు. ఎన్ కన్వెన్షన్ హాల్ మీద సంపాదించిన డబ్బులు మొత్తం ఆయన ప్రభుత్వానికి తిరిగి కట్టాల్సిందే అంటూ మరి కొంతమంది సామాజికవేత్తలు ప్రస్తుతం నాగార్జున మీద హైకోర్టులో ఒక కేసును దాఖలు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదంతా చూస్తుంటే నాగార్జున మీద కావాలనే ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక నాగార్జున ఇప్పటివరకు ఎన్ కన్వెన్షన్ హాల్ మీద కొన్ని వందల కోట్లను ఆర్జించాడు. మరి వాటిని ప్రభుత్వానికి కడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…