Nagarjuna : అక్కినేని ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. నాగేశ్వరరావు దగ్గర నుంచి నాగచైతన్య, అఖిల్ వరకు కొన్ని దశాబ్దాలుగా వీళ్ళ సినిమా కెరియర్ అనేది చాలా సాఫీగా సాగుతూ వస్తుంది. ఇక నాగేశ్వరరావు తర్వాత నాగార్జున తనదైన రీతిలో సినిమాలను చేస్తూ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అలాంటి నాగార్జున కు ప్రస్తుతం 65 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికి తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ నాగార్జున మీద తెలంగాణ ప్రభుత్వం భారీ రేంజ్ లో పగ పట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హైడ్రా పేరుతో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చి వేసిన విషయం మనకు తెలిసిందే…ఇక రీసెంట్ గా నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి అధికార పార్టీ మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖ కొన్ని బ్యాడ్ కామెంట్లు చేయడం అనేది ఇప్పుడు భారీ చర్చలకు తెర లేపుతుంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో నాగార్జున న్యాయ పోరాటం చేస్తున్నాడు.
నిజానికి నాగార్జున ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటున్నాడా? లేదంటే అధికార పార్టీ వాళ్ళు కావాలనే నాగార్జునని ఇరకాటంలో పెడుతున్నారా? అనే విషయాల మీద ఎవరికి సరైన క్లారిటీ లేదు ఇంకా కొండా సురేఖ మీద 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం మనకు తెలిసిందే. ఇక అందులో భాగంగానే నిన్న నాగార్జున, అమల నాగచైతన్య, సుప్రియలు కలిసి హైకోర్టుకు వెళ్లి గౌరవ మెజిస్ట్రేట్ ముందు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని తెలియజేసినట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే కొండా సురేఖను కూడా చాలావరకు విమర్శిస్తూ నాగార్జున మాట్లాడాడట.
ఏ ప్రూఫ్ లేకుండా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు అంటూ నాగార్జున చాలా వరకు తన బాధను వెళ్ళబుచుకున్నాడు. ఇక దాంతో హైకోర్టు ఆ కేసుని మూడు రోజులపాటు వాయిదా వేస్తూ కొండా సురేఖకి నాగార్జున తన పైన భారీ చర్యలు తీసుకోమంటున్నాడు దీని మీద మీ స్పందన ఏంటి అనే ఒక లేఖ ను ఆమెకి పంపించబోతునట్టుగా తెలుస్తుంది. మరి దాన్ని బట్టి నాగార్జున కేసు ఎటువైపు వెళుతుంది.
ఎవరికి ఇందులో న్యాయం జరగబోతుందనేది క్లియర్ కట్ గా తెలియజేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి నాగార్జున న్యాయపోరాటం ఎంతవరకు ఫలిస్తుందనేది…ఇక ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి ఈ విషయం మీద ఎలాంటి స్పందన తెలియజేయకపోవడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తిని నెలకొల్పుతుంది…