Social Updates: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి తన గారాలపట్టి అర్హ అంటే ప్రాణం. నిత్యం కూతురితో సరదాగా ఆడుకుంటూ ఉంటాడు బన్నీ. తాజాగా అర్హతో కలిసి సరదాగా రన్నింగ్ చేశారు. ఈ రన్నింగ్ రేస్ కి సంబంధిత వీడియోను ఆయన సతీమణి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గ్లామర్ బ్యూటీ నివేదా పేతురాజ్ లో మంచి టాలెంట్ ఉంది. ముఖ్యంగా ఆమె రేసర్ కూడా. కాగా త్రాను కారు డ్రైవింగ్ చేసిన దృశ్యాల్ని అభిమానులతో పంచుకుంది నివేదా పేతురాజ్.
సిమ్రన్ చౌదరి భారీ హిట్ కోసం కెరీర్ సెటిల్ మెంట్ కోసం ప్రస్తుతం బాగా కష్టపడుతుంది. ఇక ఈ భామ తన కొత్త ఫొటోల్ని షేర్ చేస్తూ ‘సెహరి మూడ్’ అనే కామెంట్ ను పోస్ట్ చేసింది. అన్నట్టు సిమ్రన్ చౌదరి హర్ష్ కనుమిల్లి హీరోగా తెరకెక్కిన “సెహరి’లో కథానాయికగా నటిస్తోంది.
హోమ్లీ భామ అంజలి నో టైటిల్స్, జస్ట్ వైబ్ అంటూ ఒక ఫొటోని పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో స్టైలిష్ కళ్లద్దాలు పెట్టుకుని సరదాగా అందరినీ ఆకట్టుకుంది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం…
[…] KCR: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ ఆయన వెంట ఉండాల్సి ఉన్నా ఉండకపోవడం విమర్శలకు దారితీస్తోంది. దేశానికి ప్రధాని వస్తే కనీసం మర్యాదపూర్వకంగా గానీ కలవకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కు ఇంత అహంకారమా అనే వాదనలు సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం కేసీఆర్ కు ఇక రోజులు దగ్గర పడ్డాయనే సంకేతాలు సైతం వస్తున్నాయి. కేంద్రంతో పెట్టుకుంటే అంతే సంగతి చుక్కలు చూపించడం ఖాయమనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకునే చర్యలకు కేసీఆర్ ఎలా బాధ్యుడవుతారో అని అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. […]
[…] Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఒక్కడు’. ఈ చిత్రం అప్పటికి ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసి మహేశ్ సినీ కెరీర్ లో నే బెస్ట్ మూవీగా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్ చేశారు. ఈ పిక్చర్ లోని యాక్షన్ సీక్వెన్సెస్, మహేశ్, భూమిక, ప్రకాశ్ రాజ్ ల మధ్య సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇకపోతే ఈ సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం కామెడీ ఎపిసోడ్ కూడా చాలా ఆకట్టుకుంటుంది. కాగా, ఆ సీన్ లో ధర్మ వరపు తన ఫోన్ నెంబర్ 98480 32919 అని చెప్తుంటాడు. ఆ నెంబర్ ఎవరిది? ఆ సీన్ లో ఆ నెంబరే ఎందుకు పెట్టారు? ఆ విషయమై డైరెక్టర్ ఏం ఆలోచించాడు ? అనే సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం. […]
[…] Sammakka Saralamma Jatara: తెలంగాణ కుంభమేళా సమ్మక్క-సారలమ్మ జాతర. దాదాపు కోటి మంది భక్తులు దర్శించుకునే అతిపెద్ద గిరిజన జాతర. అయినా ప్రభుత్వం మాత్రం సెలవులు ఇవ్వకపోవడంపైనే అందరు ఆందోళన చెందుతున్నారు. అత్యంత జనం హాజరయ్యే జాతరగా గుర్తింపు పొందినా ఇప్పటివరకు జాతరను గౌరవించకోవడం గమనార్హం. జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో పండుగకు వెళ్లాలంటే అందరికి వీలు కావడం లేదు. […]