Chiranjeevi: టాలీవుడ్ లో ఒక్క సినిమాతోనే సంచలనం సృస్టించిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. తన తొలి సినిమానే నాగార్జునతో కలిసి శివ చేశారు. అది నాగ్ కెరీర్‌నే మార్చేసింది. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు రామ్ గోపాల్ వర్మ. ఆ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడా ఎంతో ఇష్టపడ్డారు. ఇలాంటి డైరెక్టర్ తో సినిమా తీస్తే తన ఇమేజ్ మరింత పెరుగుతుందని భావించారు.
అయితే ఈ కాంబినేషన్‌ను కలిపేందుకు ఎందరో ప్రయత్నించినా కుదరలేదు. కానీ రేర్ కాంబినేషన్లను కలపడంలో దిట్ట అయిన వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ అప్పటికే పెద్ద ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఆయన ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మూవీ తీసేందుకు రెడీ అయిపోయారు. కాగా అప్పటికే హిట్లర్ మూవీకి చిరు ఓకే చెప్పారు. అయినా సరే వర్మ మూవీ కోసం కొన్ని డేట్లను అడ్జస్ట్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.
Also Read: డామిట్.. కథ అడ్డం తిరిగింది.. ఏపీ ఉద్యోగుల సమ్మె లేదా..? ఇప్పుడేం చేయాలి..?!
కానీ అప్పటికే వర్మ హిందీలో సంజయ్ దత్, ఊర్మిల కాంబినేషన్ లో దౌడ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే మూవీ మధ్యలోనే సంజయ్ దత్ జైలుకు వెళ్లారు. ఆయన ఎప్పుడు రిలీజ్ అవుతారో తెలియని పరిస్థితులు. ఈ క్రమంలోనే మెగాస్టార్ మూవీని ప్రారంభించారు వర్మ. 1996 ఆగస్టు 11న బెంగుళూర్ లో ఈ మూవీని స్టార్ట్ చేశారు.
చిరంజీవి, ఊర్మిల మీద ఓ పాట, ఇంకొన్ని సన్నివేశాలతో మొదటి షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు వర్మ. ఇంతలో సంజయ్ దత్ బెయిల్ మీద రావడంతో.. మొదటగా దౌడ్ సినిమాను కంప్లీట్ చేసి ఆ తర్వాత చింరజీవి మూవీని ఫినిష్ చేస్తానని ఒప్పించి వెళ్లాడు వర్మ. కానీ నెలలు కావస్తున్నా కూడా దౌడ్ సినిమాను కంప్లీట్ చేయలేదు. హిట్లర్ మూవీ అయిపోవడానికి వచ్చింది. ఇతర నిర్మాతలు చిరు కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.
కానీ వర్మ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో చిరంజీవి మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఒక్క వ్యక్తి కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని ఇతర నిర్మాతలకు ఓకేచెప్పాడు చిరంజీవి. అలా ఈ ఇద్దరి కాంబినేషన్ లో రావాల్సిన మూవీ అర్థాంతరంగానే ఆగిపోయింది.