Sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వారిద్దరు డేటింగులో ఉన్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వారిద్దరు తరచుగా ముంబైలోని హోటళ్లలో కలుసుకుంటున్నారని, రెస్టారెంట్లకు వెళుతున్నారనే ఊహాగానాలు బలంగా వీస్తున్నాయి. దీనిపై ఎవరు కూడా ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. దీంతో నాగచైతన్య, సమంత విడాకుల తరువాత వారి కెరీర్ పైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కానీ చైతు, శోభిత విషయంలో వస్తున్న వార్తలపై చైతు మాత్రం స్పందించడం లేదు. సమంత కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎవరి ఇష్టం వారిది అన్న ధోరణిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

చైతు నాలుగు సినిమాల హిట్లతో దూకుడు మీదున్నాడు. పైగా సినిమాల ఎంపికలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నాడు. అమీర్ ఖాన్ తో ఓ హిందీ సినిమాలో నటించాడు. అది ఆగస్టులో విడుదల కానుంది. దిల్ రాజు నిర్మాణంలో థ్యాంక్యూ సినిమాలో కూడా చైతు నటించాడు. అది కూడా విడుదలకు రెడీగా ఉంది. దీంతో చైతన్య వరుస సినిమాలతో జోరు కొనసాగిస్తున్నాడు. కెరీర్ ను మలుచుకుంటూ సినిమాలు చేస్తూ పోతున్నాడు. మరోవైపు సమంత కూడా తన సినిమాల జోరును కొనసాగిస్తోంది.
Also Read: Politics Crisis Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ‘షిండే’ తిరుగుబాట్లు సాధ్యమేనా?
చైతు, శోభిత లపై వస్తున్న పుకార్లపై శోభిత ఘాటుగానే స్పందిస్తోంది. శోభిత అడివి శేషుతో గూఢచారి, ఇటీవల వచ్చిన మేజర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించినా తనకు తగిన గుర్తింపు మాత్రం రాలేదు. అందుకే ఇతర సినిమాల్లో అవకాశాలు రాలేదు. దీంతో ఆమె కూడా కెరీర్ ఎదుగుదలకే ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఆమెపై ఇలాంటి పుకార్లు రావడంతో ఆమె స్పందించి తన మధ్య వేలిని చూపిస్తూ ఓ వీడియో షేర్ చేసింది. అనవసర పుకార్లు వద్దంటూ సూచించినట్లు తెలుస్తోంది. ఇలాంటి పుకార్లు సృష్టించి తమ కెరీర్ ను దెబ్బతీయొద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

దీనిపై చైతు మాత్రం స్పందించలేదు. తన కెరీర్ ప్లాన్ లోనే ఉన్నాడు. షూటింగులలో బిజీగా ఉండటంతో ఈ పుకార్లను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సినిమాల పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. మంచి జోరుమీదున్న చైతు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందుకే ఇలాంటి వాటిని లెక్క చేయడం లేదనే సమాచారం. మొత్తానికి చైతు, శోభిత ప్రేమాయణం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Carnivorous plant : హిమాలయాల్లో అద్భుతం.. మాంసాహార మొక్క.. దగ్గరికొస్తే తినేస్తోంది! వైరల్ వీడియో
Recommended Videos
[…] Also Read: Sobhita Dhulipala: నాగచైతన్యతో డేటింగ్ వార్తలపై … […]
[…] Also Read: Sobhita Dhulipala: నాగచైతన్యతో డేటింగ్ వార్తలపై … […]
[…] Also Read: Sobhita Dhulipala: నాగచైతన్యతో డేటింగ్ వార్తలపై … […]