https://oktelugu.com/

Sobhita Dhulipala : పెళ్లి కాకముందే గర్భం దాల్చిన శోభిత దూళిపాళ్ల..షాక్ లో నాగ చైతన్య..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!

మన తెలుగు సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తాను అని చెప్పుకుంటూ వచ్చే ఈమె, అక్కడ రొమాంటిక్ సన్నివేశాల్లో బోల్డ్ గా నటిస్తూ రెచ్చిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.

Written By:
  • Vicky
  • , Updated On : September 30, 2024 / 08:35 PM IST

    shobitha dulipalla

    Follow us on

    Sobhita Dhulipala : టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ ట్రేండింగ్ లో బ్యూటిఫుల్ కపుల్ నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల. సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభిత దూళిపాళ్లకు బాగా దగ్గరయ్యాడు. ఆమెతో ప్రేమాయణం నడిపి చాలా కాలం వరకు డేటింగ్ చేసాడు. వీళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నారు అనే విషయాన్ని జనాలు మొదట్లో పెద్ద నమ్మలేదు. కానీ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా అకస్మాత్తుగా వీళ్లిద్దరు నిశ్చతార్థం చేసుకొని ప్రకటించడం అందరినీ షాక్ కి గురి చేసింది. అసలు వీళ్లిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, సమంత తో విడాకులు తీసుకోవడానికి అసలు కారణం శోభిత తో రిలేషన్ పెట్టుకోవడం వల్లనేనా?, లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న.

    ఇకపోతే శోభిత దూళిపాళ్ల రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ లో బేబీ బంప్ తో ఉన్న పోస్ట్ ని అప్లోడ్ చేసి సంచలనం సృష్టించింది. నిశ్చితార్థం జరిగి రెండు నెలలు కూడా కాలేదు, అప్పుడే బేబీ బంప్ ఎలా వచ్చింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. నయనతార లాగ పెళ్ళికి ముందే గర్భం దాల్చావా?, డేటింగ్ సమయంలోనే ఇదంతా జరిగిందా వంటి ప్రశ్నలు శోభిత కి ఎదురయ్యాయి. అయితే ఇది నిజమైన బేబీ బంప్ కాదట. శోభిత ఇటీవలే జీ తెలుగు సంస్థ తెరకెక్కించిన ‘లవ్ సితార’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇటీవలే స్ట్రీమింగ్ లోకి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో తీసుకున్న కొన్ని ఫోటోలను శోభిత అప్లోడ్ చేస్తూ ఆ చిత్రం తాలూకు జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. అయితే ఒక్కసారిగా ఆమె బేబీ బంప్ తో ఉన్నటువంటి ఫోటో వైరల్ అవ్వడంతో ఇదెలా జరిగింది అంటూ ఆడియన్స్ షాక్ కి గురయ్యారు. శోభిత దూళిపాళ్ల తెలుగు అమ్మాయి అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈమె తెలుగు లో కంటే ఎక్కువగా హిందీ లోనే సినిమాలు చేస్తూ వస్తుంది.

    మన తెలుగు సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తాను అని చెప్పుకుంటూ వచ్చే ఈమె, అక్కడ రొమాంటిక్ సన్నివేశాల్లో బోల్డ్ గా నటిస్తూ రెచ్చిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఆమె చేతిలో రెండు హిందీ సినిమాలు, ఒక్క వెబ్ సిరీస్ ఉంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఇవి పూర్తి అయ్యాక ఆమె పెళ్ళికి సిద్ధం అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చందూ మొండేటి దర్శకత్వం లో ‘తండేల్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది లో విడుదల కాబోతుంది.