Bigg Boss Telugu 8 బిగ్ బాస్ రియాలిటీ షో జరుగుతున్న సమయంలో వీకెండ్ ఎపిసోడ్స్ కాకుండా ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూసేది నామినేషన్స్ ఎపిసోడ్స్ కోసమే. నామినేషన్స్ సమయంలో కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదాలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఒక్కోసారి కంట్రోల్ తప్పి బూతులు కూడా తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. సీజన్ 7 ల్లో అలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఈ సీజన్ లో కూడా అలాంటివి జరుగుతున్నాయి కానీ, గత సీజన్ తో పోలిస్తే కాస్త తక్కువే. ఇక నేడు జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ లో నిఖిల్, నబీల్, మణికంఠ, నైనిక, ఆదిత్య ఓం, విష్ణు ప్రియా వంటి వారు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేందుకు నామినేట్ అయ్యారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, ఒక ఎలిమినేషన్ బుధవారం రోజున ఉంటుంది అని హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ కి తెలియచేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అతి కీలకమైన నామినేషన్స్ కావడంతో కంటెస్టెంట్స్ ఈసారి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన మూడవ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ప్రారంభంలో ముందుగా విష్ణు ప్రియా నైనిక ని నామినేట్ చేస్తుంది. అందుకు ఆమె కారణం చెప్తూ ‘నాకు ఈ వారం నువ్వు ఆడిన ఆట తీరు నాకు నచ్చలేదు’ అంటుంది. అప్పుడు నైనిక దానికి సమాధాన చెప్తూ ‘నీకు మాట్లాడడం రాకపోవచ్చు, గొడవ పడడం రాకపోవచ్చు కానీ నీకు ఆడడం వచ్చు’ అని అంటుంది. అలా ఏ సందర్భంలో ఆమె అనిందో తెలియాలంటే రాత్రి వరకు ఆగాల్సిందే. ఆ తర్వాత విష్ణు ప్రియా నబీల్ ని ఆహారం విషయం లో నామినేట్ చేస్తుంది. దీనికి పాపం నబీల్ బాగా ఫీల్ అవుతాడు. ఇక ఆ తర్వాత యష్మీ మణికంఠ ని నామినేట్ చేస్తుంది. అతనికి యష్మీ చెప్పిన పాయింట్ నచ్చకపోవడం ఇది రివెంజ్ నామినేషన్ అని అంటాడు. అప్పుడు యష్మీ ‘అవును..నువ్వు నా హృదయాన్ని బద్దలు కొట్టావు’ అని అంటుంది.
అప్పుడు యష్మీ ఆడియన్స్ తో మాట్లాడుతూ ‘మణి ఒక స్నేహితుడిగా నా గుండెని ముక్కలు చేసాడు..అందుకే నామినేట్ చేస్తున్నా!’ అంటూ అతని ఫోటోని తగలబెడుతుంది. యష్మీ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా అందరికీ అనిపిస్తుంది. ఒక్క వారం మణికంఠ నామినేట్ చేసినందుకు, ప్రతీ వారం అతన్ని నామినేట్ చేస్తూనే ఉంది. దీని వల్ల ఆమె గ్రాఫ్ బాగా తగ్గి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక ఆ తర్వాత పృథ్వీ మణికంఠ ని నామినేట్ చేస్తాడు. వీళ్లిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అప్పుడు మణికంఠ పృథ్వీ తో ‘పృథ్వీ దయచేసి నన్ను రెచ్చగొట్టకు’ అని అంటాడు, అప్పుడు పృథ్వీ ‘రెచ్చగొడుతా..ఏమి పీకుతావు’ అంటూ రెచ్చిపోయాడు. తర్వాత ఏమి జరిగింది అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ ఎపిసోడ్ లో ఆదిత్య ఓం కూడా తనలోని ఫైర్ మొత్తం బయటకి తీసాడు.