Shiva Rajkumar: ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్(Global Star Ram Charan) ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చి బాబు(Buchi Babu Sana) తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమా, రెండు కీలక షెడ్యూల్స్ ని పూర్తి చేసుకొని, మూడవ షెడ్యూల్ లోకి అడుగుపెట్టింది. ‘రంగస్థలం’ చిత్రం తర్వాత రామ్ చరణ్ మరోసారి గ్రామీణ నేపథ్యం ఉన్న స్టోరీ తో సినిమా చేస్తుండడంతో అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై అంచనాలు ప్రారంభ స్థాయి నుండే భారీగా ఉన్నాయి. పైగా రామ్ చరణ్ కి రంగస్థలం తర్వాత #RRR మినహా సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. వినయ విధేయ రామ ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. అదే విధంగా #RRR తర్వాత విడుదలైన ‘ఆచార్య’, ‘గేమ్ చేంజర్’ చిత్రాల పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
రామ్ చరణ్ కి ఇలాంటి కష్టమైన సమయం ఇంతకు ముందు కెరీర్ పరంగా ఎప్పుడూ రాలేదు. అప్పట్లో మగధీర తర్వాత ‘ఆరెంజ్’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తగిలింది. ఆ తర్వాత వెంటనే ఆయన కోలుకొని రచ్చ, నాయక్, ఎవడు, గోవిందుడు అందరి వాడేలే వంటి బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు. ఆ తర్వాత మధ్య లో ‘బ్రూస్లీ’ ఒక్కటి ఫ్లాప్ అయ్యింది కానీ ఆ తర్వాత వచ్చిన ‘ధృవ’, ‘రంగస్థలం’ లాంటి సినిమాల ఫలితాలు మన అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ కి కష్ట కాలం మొదలైంది. ఆ కష్టాల నుండి బుచ్చి బాబు తో చేయబోయే సినిమా బయట పడేస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. ఇకపోతే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్(Shivarajkumar) ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులైంది.
కానీ ఆ తర్వాత శివ రాజ్ కుమార్ కి కాన్సర్ ట్రీట్మెంట్ జరగడంతో కొంతకాలం షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడంతో, తదుపరి షెడ్యూల్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధం అయ్యాడు. నేడు ఆయనకు సంబంధించిన లుక్ టెస్ట్ పూర్తి అయ్యింది. డైరెక్టర్ బుచ్చి బాబు తో పాటు, మూవీ టీం నేడు ఆయన ఇంటికి వెళ్లి లుక్ టెస్ట్ చేసిన వీడియోని కాసేపటి క్రితమే విడుదల చేసారు. దీనికి అభిమానుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. శివ రాజ్ కుమార్ కి స్వాగతం పలుకుతూ రామ్ చరణ్ అభిమానులు ట్వీట్లు వేస్తున్నారు. చూస్తుంటే శివ రాజ్ కుమార్ ఈ చిత్రం ద్వారా ఎవ్వరూ ఊహించని మేక్ ఓవర్ తో రాబోతున్నాడని అర్థం అవుతుంది. ఆయన పాజిటివ్ క్యారక్టర్ చేస్తున్నాడా?, లేదా నెగటివ్ క్యారక్టర్ చేస్తున్నాడా అనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: దేశం కోసం ప్రాణత్యాగం..హీరోయిన్ మీనాక్షి చౌదరి తండ్రి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!