Samantha: సినిమాలు చేస్తున్నా, చేయకపోయినా సమంత(Samantha Ruth Prabhu) పేరు మాత్రం సోషల్ మీడియా లో ప్రతీ రోజు ఎదో ఒక టాపిక్ మీద కనిపిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు ఈ రేంజ్ ఉండేది కాదు కానీ, నాగ చైతన్య ని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అతనితో విడిపోవడం దగ్గర నుండి సమంత పేరు ఈ స్థాయిలో సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వడానికి కారణం అయ్యింది. వీళ్లిద్దరికీ సంబంధించిన ఏ వార్త వచ్చినా నెటిజెన్స్ ఆసక్తి గా చూస్తున్నారు. అందుకే వాళ్ళిద్దరిని లింక్ చేస్తూ ప్రతీరోజు ఎదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) ని పెళ్లి చేసుకొని మూడు నెలలు అయ్యింది. అయినప్పటికీ వీళ్ళ గురించి ఎదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. గత కొంత కాలంగా సమంత ఒక ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: #RC16 లోకి కన్నడ సూపర్ స్టార్ ఎంట్రీ..లుక్ టెస్ట్ పూర్తి..అభిమానులకు సెన్సేషనల్ అప్డేట్!
వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. అయితే రీసెంట్ గానే ఆమె ఒక ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె ఈ అంశంపై మాట్లాడుతూ ‘నేను నా జీవితం లో మరోసారి ప్రేమలో పడాలని అనుకోవడం లేదు. అసలు ఆ అంశం పై చర్చించడానికి కూడా నేను సిద్ధంగా లేను. ప్రేమ అనేది నా వ్యక్తిగత అంశం. దానిని వ్యక్తిగతంగానే ఉంచుతాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే సమంత గత ఏడాది ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో జీవితాంతం ఇలాగే సింగిల్ గా మిగిలిపోతారు అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘కచ్చితంగా సింగిల్ గా అయితే ఉండను’ అంటూ చెప్పుకొచ్చింది.
అప్పుడు అలా మాట్లాడిన ఆమె, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుంది?, ఈ గ్యాప్ లోనే ఆమెకి ప్రేమ మీద విరక్తి కలిగిందా అని అనుకుంటున్నారు నెటిజెన్స్. అయితే పెళ్ళికి మాత్రం సిద్ధమని, కానీ పెళ్లికి ముందు ప్రేమ, డేటింగ్ వంటివి చేసే ఓపిక లేదని ఆమె మాటల్లో దాగున్న ఉద్దేశ్యం అంటూ సమంత అభిమానులు అంటున్నారు. ఇకపోతే సమంత కి ఒకప్పటి తో పోలిస్తే ఇప్పుడు సినిమా అవకాశాలు చాలా తక్కువగానే వస్తున్నాయి. ఏ హీరో కూడా ఈమెని తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోవడం లేదు. మరోపక్క సమంత సినిమాలకు దూరమై వెబ్ సిరీస్ లు ఎక్కువగా చేస్తుంది. గత ఏడాది ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ తో మన ముందుకొచ్చిన ఈమె, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. వీటితో పాటు ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.