Singer Kalpana (1)
Singer Kalpana: ప్రముఖ సింగర్ కల్పన(Singer Kalpana) నిన్న రాత్రి అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మల్కాజ్ గిరి జిల్లాలోని నిజాంపేట్ లో నివాసం ఉంటున్న ఈమె రెండు రోజులుగా ఇంటి నుండి బయటకి రాకుండా, తలుపులు మూసుకొని అలాగే ఉండిపోయారు. అపార్ట్మెంట్ వాసులు ఆమెని కలవడానికి వచ్చి ఎంతసేపు తలుపులు కొట్టినా తీయకపోవడంతో ఆమె కుటుంబ సబ్యులకు సమాచారం అందించారు. వాళ్ళు వెంటనే అపార్ట్మెంట్స్ వద్దకు చేరుకొని, తలుపులు బద్దలు కొట్టుకొని లోపలకు వెళ్లగా, కల్పన స్పృహ తప్పి పడిపోయి ఉండడాన్ని గమనించారు. వెంటనే ఆమెకి హాస్పిటల్ కి తీసుకెళ్లగా, నిద్ర మాత్రలు మింగినట్టు డాక్టర్లు గుర్తించారు. ఎట్టకేలకు ఆమెకు సరైన సమయంలో ట్రీట్మెంట్ ని అందించి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు. ఆత్మహత్యకు పాల్పడిన ఈమెపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి ఆమె భర్త ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: ‘దయచేసి ఇక నుండి నన్ను అలా పిలవొద్దు’ అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేసిన నయనతార!
ఇక స్పృహ లోకి వచ్చిన తర్వాత, కల్పన తానూ ఎందుకు అఘాయిత్యం చేసుకోవాలి అనుకుందో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘నా పెద్ద కూతురు చాలా కాలం నుండి కేరళలో ఉంటుంది. చదువుకోవడానికి హైదరాబాద్ కి రావాలని కోరాను. కానీ ఆమె అక్కడే ఉంటానని మొండికేసింది. దీంతో తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాను. నిద్ర మాత్రలు మింగి చనిపోవాలని అనుకున్నాను’ అంటూ ఆమె ఎంతో భావోద్వేగంతో మాట్లాడింది. కేవలం కూతురు తన వద్దకు రాలేదని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని?, వినేందుకు చాలా సిల్లీ గా ఉందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే ఆమె మనసులో ఉన్న బాధ అసలు కూతురు ఎప్పటికీ ఆమెతో ఉండను అని మొండి చేసి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఎదో పెద్ద ఘర్షణే జరిగి ఉంటుంది. కేవలం ఒక్క రోజు, రెండు రోజుల సమస్య అయ్యి ఉండదని అంటున్నారు.
ఇకపోతే కల్పన తెలుగు,హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో ఎన్నో వందల పాటలు పాడింది. జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss 8 Telugu) లో కూడా దసరా స్పెషల్ ఎపిసోడ్ లో ఈమె ప్రత్యేక అతిథిగా పాల్గొని కంటెస్టెంట్స్ అందరి పేర్ల మీద పాటలు కూడా పాడింది. ఆ సమయంలో ఈమె ఎంతో ఉత్సాహం తో ఉన్నింది. ఆ ఉత్సాహం వెనుక ఇంత బాధ ఉందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.
Also Read: కృతి శెట్టిని తొక్కేసిన శ్రీలీలకు చెక్ పెట్టిన రవితేజ హీరోయిన్.. క్రేజీ ఆఫర్స్ అన్నీ ఆమెకే!