Meenakshi Chaudhary : ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో ఒకరు మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). ఈమె కెరీర్ ప్రారంభం చిన్న సినిమాలతోనే మొదలైంది. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ రేంజ్ స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది. నేడు ఆమె తన 27వ ఏటలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి కి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియచేయబోతున్నాము. మీనాక్షి చౌదరి హర్యానా ప్రాంతానికి చెందిన ఒక ఆర్మీ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈమె తండ్రి ఆర్మీ లో వీర మరణం పొందాడు. ఆర్మీ కుటుంబం కావడం తో చిన్నప్పటి నుండి మీనాక్షి చౌదరి ఇంట్లో చాలా కఠినమైన రూల్స్ ఉండేవి. కానీ ఎన్ని రూల్స్ ఉన్నప్పటికీ మీనాక్షి చౌదరి కి ఫ్రీడమ్ ఉండేది. ఆమె ప్రతిభకు ఇంట్లో ఎవ్వరూ అడ్డు పెట్టేవాళ్ళు కాదు.
Also Read : ఒక హిట్టుతో రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసిన మీనాక్షి చౌదరి..శ్రీలీలని కూడా దాటేసిందిగా!
చిన్నప్పటి నుండి మీనాక్షి చౌదరి కి క్రీడల్లో మంచి ప్రావిణ్యం ఉంది. స్విమ్మింగ్ పూల్ పోటీలతో పాటు స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలలో కూడా పాల్గొనేది. అలా తన ఆసక్తి చిన్నగా మోడలింగ్ రంగం వైపు వెళ్ళింది. అక్కడ ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీలలో పాల్గొని టైటిల్స్ ని గెలుచుకుంది. ఎప్పుడైతే ఆమె మిస్ ఇండియా కిరీటాన్ని అందుకుందో అప్పటి నుండి ఈమెకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు అయ్యాయి. అలా సుశాంత్ హీరో గా తెరకెక్కిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ, మీనాక్షి చౌదరి కి అవకాశాలు బాగానే వచ్చాయి. సక్సెస్ ని చూసేందుకు ఆమెకు రెండు సినిమాల సమయం పట్టింది. ఇప్పుడు ఆమె ఏకంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టిన సినిమాలో హీరోయిన్ గా నటించే స్థాయికి ఎదిగింది.
ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి, స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు మీనాక్షి చౌదరి ని తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు టాలీవుడ్ కి మీనాక్షి చౌదరి నెంబర్ 1 హీరోయిన్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈమె నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) తో ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నటిస్తుంది. ముందుగా ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైంది. ఆమె మీద కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ, ఆమెకు బదులుగా మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు. అదే విధంగా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమాలోనూ ఈమె ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా ప్రస్తుతం ఈమె చేతినిండా సినిమాలు ఉన్నాయి.
Also Read : ఆ ట్రోల్స్ ని చూసి వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసాను అంటూ ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్!