Madharasi Movie Collections: అమరన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత శివ కార్తికేయన్(Siva Karthikeyan) హీరో గా నటించిన చిత్రం ‘మదరాసి'(Madharasi Movie). AR మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు భారీగానే ఉండేవి. ఎందుకంటే శివ కార్తికేయన్ మొట్టమొదటిసారి ఒక స్టార్ డైరెక్టర్ తో కలిసి పని చేయబోతుండడం, ఈ చిత్రం తో కచ్చితంగా శివ కార్తికేయన్ టాప్ లీగ్ లోకి వెళ్ళిపోతాడు అనే నమ్మకం ఆడియన్స్ లో కలగడం, వీటి అన్నిటికి తోడు బ్లాక్ బస్టర్ థియేట్రికల్ ట్రైలర్ కట్ ఈ చిత్రం పై అంచనాలు అమాంతం పెంచేశాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుందని అన్నారు కానీ, సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా గాడి తప్పిందనే టాక్ వచ్చింది.
దీంతో పాపం శివ కార్తికేయన్ కి మరోసారి గట్టి దెబ్బ పడింది, ఇక ఆయన మళ్లీ కెరీర్ లో కొన్ని రోజులు ఇబ్బంది పడాల్సిందే అని సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేశారు. కానీ శివ కార్తికేయన్ కి యూత్ లో ఉన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రానికి మొదటి రోజు భారీ ఓపెనింగ్ దక్కింది. టాక్ తో సంబంధం లేకుండా తమిళనాడు ప్రాంతం నుండి 11 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 24 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న స్థాయి ఓపెనింగ్ దక్కలేదు. కేవలం కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిందట. ఇక బుక్ మై షో యాప్ లో కూడా ఈ సినిమా డామినేషన్ నే కనిపించింది.
మొదటి రోజు ఈ చిత్రానికి దాదాపుగా 2 లక్షల 76 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. తమిళనాడు లో మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో మొదటి రోజు అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమా ‘అమరన్’. దాదాపుగా 4 లక్షల 50 వేల టిక్కెట్లు ఈ సినిమాకు అమ్ముడుపోయాయి. ఇప్పుడు రెండవ స్థానం లో ‘మదరాసి’ అనే చిత్రం నిల్చింది. మొదటి రెండు స్థానాలు ఇప్పుడు శివ కార్తికేయన్ ఖాతాలోనే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శివ కార్తికేయన్ తదుపరి తమిళ సూపర్ స్టార్ ట్యాగ్ కి చాలా దగ్గరగా ఉన్నట్టు అర్థం అవుతుంది. తలపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లడం, ఆయన అభిమానులు మోత శివ కార్తికేయన్ ని లేపడం జరిగిందని అంటున్నారు. ఒక టాప్ స్పాట్ ఖాళీ అయ్యింది కాబట్టే, ఇప్పుడు శివ కార్తికేయన్ దానిని ఆక్రమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది.