కరోనా నివారణకు సితార టిప్స్..

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా(కోవిడ్-19) వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఇండియాలోనూ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కేంద్రం దేశవ్యాప్తంగా 21రోజులు లాక్డౌన్ చర్యలు చేపట్టిన సంగతి తెల్సిందే. అయితే కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రముఖంగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా కోడలు ఉపాసన ఎప్పటికప్పుడు కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు స్వీట్ డాటర్ సితార కరోనాపై నివారణపై సోషల్ […]

Written By: Neelambaram, Updated On : March 28, 2020 1:11 pm
Follow us on

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా(కోవిడ్-19) వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఇండియాలోనూ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కేంద్రం దేశవ్యాప్తంగా 21రోజులు లాక్డౌన్ చర్యలు చేపట్టిన సంగతి తెల్సిందే. అయితే కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రముఖంగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా కోడలు ఉపాసన ఎప్పటికప్పుడు కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

తాజాగా మహేష్ బాబు స్వీట్ డాటర్ సితార కరోనాపై నివారణపై సోషల్ మీడియాలో టిప్స్ వివరిస్తూ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో మహేష్ బాబు తన ట్వీటర్లో అకౌంట్లో పోస్టు చేశారు. ‘బాలవాక్కు బ్రహ్మ వాక్కని.. పిల్లలు చెప్పినవి విని కరోనా మహమ్మరికి దూరంగా ఉండాలని మహేష్ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో సితార కరోనాను ఎదుర్కొనేందుకు ముఖ్యమైన ఐదు టిప్స్ వివరించింది. అవేంటో చూద్దాం.

-ఇంట్లో ఉండి, సామాజిక దూరం త‌ప్ప‌క పాటించాలి.
-చేతుల‌ను సబ్బునీళ్లతో 20నుంచి 30సెక‌న్ల పాటు త‌ర‌చుగా శుభ్ర‌ప‌ర‌చుకోవాలి.
-ద‌గ్గు లేదా తుమ్ములు వ‌స్తున్నప్పుడు అరచేతిని కాకుండా మోచేతిని అడ్డుపెట్టుకోవాలి.
– మీ చుట్టూరా ఉన్నవారికి సుమారు మూడు మీట‌ర్ల దూరాన్ని పాటించాలి.
-మీ చేతులతో క‌ళ్లు, నోరు, అలాగే ముక్కును తాకద్దు.
ఈ ఐదింటిని పాటిస్తూ.. ఇంట్లోనే ఉంటూ క‌రోనాను దగ్గరకు రానివ్వకండి అంటూ సూచించింది.

ఇటీవల మహేష్ బాబు కరోనా నివారణకు ఆరు సూత్రాలను వివరించగా మహేష్ కూతురు మాత్రం ఐదు టిప్స్ పాటించి కరోనాకు దూరంగా ఉండొచ్చని చెబుతుంది. ఏదిఏమైనా తండ్రి కూతుళ్లు కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.