https://oktelugu.com/

Sitara: అని మాస్టర్​తో సితార స్టెప్పలు.. నెటిజన్లు ఫిదా

Sitara: సూపర్​స్టార్​ మహేశ్​బాబు కుమార్తె సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరియచం చేయనక్కర్లేదు. తను పుట్టినప్పటి నుంచి ఈ చిన్నారికి మంచి ఫాలోవర్స్ ఉన్నారు. చిన్న వయసులోనే ముద్దు ముద్దు మాటలతో.. అల్లరి చేష్టలతో అభిమానులను ఆకట్టుకున్న ఈ అందాల బొమ్మ.. ఇప్పుడు సోషల్​మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్​గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తనలోని టాలెంట్​ను బయటపెడుతూ.. అభిమానులను అలరిస్తోంది. https://www.instagram.com/tv/CWqePNAFC3N/?utm_source=ig_web_copy_link గతంలో ఓ సారి మహేశ్​ సినిమా పాటలకు స్టెప్పులేసి.. అందరి మెప్పును పొందింది సితార. తాజాగా, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 25, 2021 / 11:47 AM IST
    Follow us on

    Sitara: సూపర్​స్టార్​ మహేశ్​బాబు కుమార్తె సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరియచం చేయనక్కర్లేదు. తను పుట్టినప్పటి నుంచి ఈ చిన్నారికి మంచి ఫాలోవర్స్ ఉన్నారు. చిన్న వయసులోనే ముద్దు ముద్దు మాటలతో.. అల్లరి చేష్టలతో అభిమానులను ఆకట్టుకున్న ఈ అందాల బొమ్మ.. ఇప్పుడు సోషల్​మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్​గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తనలోని టాలెంట్​ను బయటపెడుతూ.. అభిమానులను అలరిస్తోంది.

    https://www.instagram.com/tv/CWqePNAFC3N/?utm_source=ig_web_copy_link

    గతంలో ఓ సారి మహేశ్​ సినిమా పాటలకు స్టెప్పులేసి.. అందరి మెప్పును పొందింది సితార. తాజాగా, మరో కొత్త వీడియోతో పలకరించింది ఈ చిన్నారి.

    Also Read: పూజా వద్దనుకున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్​.. సమంత చేతుల్లోకి

    ఈ సారి తనలోని డాన్స్​ను అందరికీ పరిచయం చేసింది. పాపులర్​ కొరియోగ్రాఫర్​ బిగ్​బాస్ కంటెస్టెంట్ అనీ మాస్టర్​తో కలిసి ఓ వెస్టర్న్​ పాటకు స్టెప్పులేస్తూ కనిపించింది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన వీడియోను ఇన్​స్టాగ్రామ్​ వేదికాగ పోస్ట్ చేసింది. ఇందులో ముందు అనీ మాస్టర్ డాన్స్ చేస్తుండగా.. సితార కూడా అందుకు తగ్గట్లుగా స్టెప్పులేస్తూ కనిపించింది. ప్రస్తతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. సితార డాన్స్​ను చూసిన మహేశ్ అభిమానులు.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

    Sitara

    కాగా, ప్రస్తుతం మహేశ్ సర్కారు పాట సినిమాతో ఫుల్​ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా… ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్​లో ఈ సినిమా విడుదల కానుంది.

    Also Read: భర్తతో స్పెయిన్​లో ఎంజాయ్​ చేస్తున్న నిహారిక