Rajamouli: కొన్ని పుకార్లు వినడానికి కూడా విచిత్రంగా ఉంటాయి. కానీ, వాటిల్లో ఎక్కడో నిజం ఉంటుంది. ప్రస్తుతం అలాంటి పుకారు ఒకటి బాగా వైరల్ అవుతుంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ కి పవన్ కళ్యాణ్ తన భీమ్లా నాయక్ ను, ప్రభాస్ తన రాధేశ్యామ్ ను రిలీజ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో పాటు పోటీగా ఈ సినిమాలు విడుదల అవుతున్నాయి అని అనగానే ఆర్ఆర్ఆర్ టీమ్ కు టెన్షన్ మొదలైంది.

ఆంధ్రలో ఇప్పటికే రేట్లు లేవు అని, టికెట్ రేట్లుకు తోడు అదనపు షోలు కూడా ఉండవు అని జగన్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కాబట్టి.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి ముందే దాదాపు ముప్పై కోట్లు నష్టపోయింది. అన్నిటికీ మించి కనీసం 20 శాతం అమ్మకం రేట్లు తగ్గించాలి. మొత్తమ్మీద ఆంధ్ర, సీడెడ్ ల బిజినెస్ విషయంలో భారీగా నష్టపోయాం అనే బాధలో ఉంది రాజమౌళి టీమ్.
ఇలాంటి పరిస్థితుల్లో టఫ్ కాంపిటీషన్ అవసరమా ? పోటీగా స్టార్ హీరోల సినిమాలు విడుదలయితే పరిస్థితి ఏమిటి? అని రాజమౌళి ఓ చర్చ మొదలుపెట్టారు. ఆ చర్చలో ఇంకా భారీ నష్టాలు కనిపించాయి. అందుకే, ఇప్పుడు ఏం చేయాలా అని రాజమౌళి తెగ ఆలోచిస్తున్నాడు. ఎలాగైనా పవన్ ను కలిసి సినిమా పోస్ట్ ఫోన్ చేసుకోవాలని కోరుదాం అనుకుంటున్నాడు.
కానీ, పవన్ అపాయింట్ మెంట్ కోసం ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారట. ఎక్కడో ఇగో అడ్డు వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే రాజమౌళికి మాజీ సీఎం చంద్రబాబు గుర్తుకు వచ్చారు. ఆయన రికమెండేషన్ తో పవన్ సినిమాని పోస్ట్ ఫోన్ చేయించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఎలాగూ చంద్రబాబుతో రాజమౌళికి సన్నిహిత సంబంధాలు వున్నాయి.
Also Read: Drushyam 2 Telugu Movie Review: దృశ్యం2 రివ్యూ
కాబట్టి, చంద్రబాబును అప్రోచ్ అవుతున్నాడు. బాబు చెబితే పవన్ కూడా మాట వింటాడు అని ఒక టాక్ ఉంది. కాబట్టి ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరి చంద్రబాబు మాట పవన్ వింటాడా ? రాజమౌళి కోరిక తీరుతుందా ? చూడాలి.
Also Read: Samantha: నీ పెంపుడు కుక్కకు ఉన్న ఇంపార్టెన్స్ కూడా చైతూకు లేదా సమంత!