https://oktelugu.com/

Tollywood: ఫిల్మ్ ఇండస్ట్రికి ఊహించని షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం…

Tollywood: ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా ఈరోజు ఏపీ శాస‌న స‌భలో సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ పెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఇక నుంచి ఏపీ సినిమా హాళ్లలో కేవలం నాలుగు షో లే నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని ఆదేశించారు. అదనపు షోలకు అవకాశం లేదని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 25, 2021 11:49 am
    Follow us on

    Tollywood: ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా ఈరోజు ఏపీ శాస‌న స‌భలో సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ పెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఇక నుంచి ఏపీ సినిమా హాళ్లలో కేవలం నాలుగు షో లే నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని ఆదేశించారు. అదనపు షోలకు అవకాశం లేదని స్పష్టం చేసింది.

    andhra pradesh state governament shocking decision about film industry

    ఈ తాజా నిర్ణ‌యం వ‌ల్ల నిర్మాత ల‌కు ఇప్పటి వ‌ర‌కు వ‌చ్చిన లాభాలు రాక‌పోవ‌చ్చు అని సినివర్గాల్లో చర్చించుకుంటున్నారు. దీంతో హీరోల పారితోషికాలు గ‌ణ‌నీయం త‌గ్గే అవ‌కాశం కూడా ఉండ‌నుంది. అయితే ఈ ఆన్‌లైన్ టికెట్స్ పై ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర వ్యాఖ్య‌లు కూడా చేశాడు. కాగా ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోలు అయిన మెగా స్టార్ చిరంజీవి ఆచార్య, నాగార్జున బంగార్రాజు, బాల కృష్ణ అఖండ, పవ‌న్ క‌ళ్యాణ్ భీమ్లా నాయ‌క్ సినిమాతో పాటు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో ఆర్ఆర్ఆర్, ప్రభాస్ రాధే శ్యామ్, మహేశ్ బాబు సర్కారు వారి పాట, అల్లు అర్జున్ పుష్ప సినిమాలు విడుద‌లకు సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు పెదవి విరుస్తున్నారు. ఈ కారణంగా సినిమా కేక్షన్లు దెబ్బతినే అవకాశం ఉందని పలువురు సినిమా ఇండస్ట్రి పెద్దలు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.