Allu Arjun- Sirish: స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముగ్గురు అబ్బాయిల్లో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. మిగతా ఇద్దరు వెంకట్, శిరీష్ మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. వెంకట్ ఇటీవలే నిర్మాతగా మారారు. వరుణ్ తేజ్ హీరోగా విడుదలైన ‘గని’ చిత్రానికి ఆయన నిర్మాతగా ఉన్నారు.ఇక అల్లు శిరీష్ హీరోగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన పరిశ్రమకు వచ్చి పదేళ్లు కావస్తున్నా బ్రేక్ రాలేదు. ఈ యంగ్ హీరో తాజాగా పాప్యులర్ టాక్ షో ఆలీతో సరదాగా కు హాజరయ్యారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అల్లు అరవింద్ కి ముగ్గురు కాదు నలుగురు కుమారులన్న విషయం ఈ వేదికగా బయటపడింది. హోస్ట్ ఆలీ అల్లు అరవింద్ కి ఎంత మంది కొడుకులు? అని అడిగారు. మేము నలుగురం. పెద్దన్నయ్య వెంకట్ తర్వాత రాజేష్ మరో అన్నయ్య. నేను పుట్టక ముందే రాజేష్ అన్నయ్య ఒక ప్రమాదంలో మరణించాడని శిరీష్ వెల్లడించారు. ఇక ముగ్గురు అన్నదమ్ములో కోపిష్టి ఎవరని అడగ్గా.. కోపిష్టి ఎవరూ లేరు. నేనే కొంచెం నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాడిని. ఎవరైనా సినిమా ఎలా ఉంది? అని అడిగితే బాగోలేదని టక్కున చెప్పేసే వాడిని. ఒక సినిమా తీయడానికి పడే కష్టం తెలిశాక అలా చెప్పడం తప్పని తెలిసింది అన్నాడు.
చిన్నప్పుడు నేను అల్లరివాడిని, బన్నీ మాత్రం చాలా డల్ గా ఉండేవాడు. ఎప్పుడూ చదువుకుంటూ వుండేవాడు. మా ఇద్దరికీ డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ అంటే పిచ్చి. అది చూసి గోడలు దూకేవాళ్ళం. బన్నీ నేను రక్తం వచ్చేటట్లు కొట్టుకునేవాళ్ళం. అప్పట్లో అది ఒక సరదా. నాకు 21 ఏళ్ళు రాగానే కారు కావాలని నాన్నను అడిగాను. చెప్పు తీసుకొని కొడతా అన్నాడు. నేను కోరుకున్న కారు కొనుక్కోవడానికి నాకు మూడేళ్లు పట్టింది. కారు కొనివ్వలేదని అప్పుడు నాన్న పై కోపం వచ్చింది. ఇప్పుడు అర్థం అయ్యాక గౌరవం పెరిగిందని శిరీష్, అన్నారు. ఇలా అనేక ఆసక్తికర విషయాలు శిరీష్ ఈ టాక్ షోలో వెల్లడించారు.

కాగా ఊర్వశివో రాక్షసివో చిత్రంతో హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు హీరో అల్లు శిరీష్. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. దర్శకుడు రాకేష్ శశి టేకింగ్ మేకింగ్ అదుర్స్ అంటున్నారు. కామెడీ రొమాన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక అను ఇమ్మానియేల్ గ్లామర్ యూత్ ని కట్టిపడేస్తుంది. అల్లు శిరీష్ నుండి ఈ రేంజ్ లిప్ లాక్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదని ప్రేక్షకులు అంటున్నారు. ఏకంగా 12 లిప్ లాక్ సీన్స్ తో టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ అయ్యాడు అంటున్నారు.