Urvasivo Rakshasivo Collections: అల్లు శిరీష్ హీరో గా నటించిన ‘ఊర్వశివో రాక్షసీవో’ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది..రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సినిమాలో సునీల్ మరియు వెన్నెల కిషోర్ వంటి కమెడియన్స్ కామెడీ బాగా క్లిక్ అవ్వడం వల్ల ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది..టీజర్ మరియు ట్రైలర్ దగ్గర నుండే ప్రేక్షకుల అటెన్షన్ ని తన వైపు తిప్పుకున్నప్పటికీ కూడా ఓపెనింగ్స్ మాత్రం రాలేదు.

ఇలాంటి సినిమాలను ఈమధ్య ప్రేక్షకులు థియేటర్స్ లో చూడడానికంటే, OTT లో చూడడానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు..ప్రేక్షకులు థియేటర్స్ కి కదలాలి అంటే కచ్చితంగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే చూడాలి అని అనిపించేలా ఉండాలి..అప్పుడే వాళ్ళు బ్రహ్మరధం పడుతున్నారు..దానికి రీసెంట్ ఉదాహరణే ‘కాంతారా’ చిత్రం..ఇప్పటికి ఆడియన్స్ ఈ సినిమాని చూడడానికే మొదటి ఆప్షన్ గా పెట్టుకోవడం తో దాని ప్రభావం ఈ సినిమా కలెక్షన్స్ పై బాగానే పడింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 7 కోట్ల రూపాయలకు పైగానే జరిగింది..ఇది అల్లు శిరీష్ రేంజ్ కి ఎక్కువ అనే చెప్పాలి..ఎందుకంటే ఆయన గత చిత్రాలేవీ కూడా సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ పది కోట్ల రూపాయలకు దాటి వసూళ్లను రాబట్టలేదు..బిజినెస్ ని 5 కోట్ల రూపాయలకు లోపు జరుపుకొని ఉంటె బాగుండేదని ట్రేడ్ పండితుల అభిప్రాయం..6 రోజులకు కలిపి ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా కేవలం 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట పట్టాలంటే ఇంకా 5 కోట్ల రూపాయిల వరుకు షేర్ వసూళ్లను రాబట్టాలి..వీక్ డేస్ లో ఈ సినిమా కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి..నిర్మాతలు ఈ వీకెండ్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు..ఈ వీకెండ్ లో ఎంత వసూళ్లను రాబట్టిన ఫుల్ రన్ లో ఈ చిత్రం 5 కోట్ల రూపాయిల షేర్ కి మించి వసూళ్లను రాబట్టలేదు..కాబట్టి అల్లు శిరీష్ కెరీర్ లో మరో డిజాస్టర్ ఫ్లాప్ గా ఈ చిత్రం మిగిలిపోయింది.