https://oktelugu.com/

Bigg Boss 5: బిగ్ బాస్ 5 నుంచి సిరి ఔట్… అతని గురించి ఏం చెప్పిందంటే

Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 ఈరోజు ఎపిసోడ్ తో పూర్తి కానుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని ఎంతో వైభవంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ ఈవెంట్ కి రాజమౌళి, అలియాభట్, నాని, దేవిశ్రీప్రసాద్, సుకుమార్, రష్మిక, సాయి పల్లవి, కృతిశెట్టి ఇలా చాలా మంది స్టార్స్ అతిథులుగా వస్తున్నారు. సిరి, షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్, మానస్ ఈ ఐదుగురిలో ముందుగా ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. ఇక మిగిలిన ముగ్గురిలో ఒకరు విన్నర్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 19, 2021 / 08:32 PM IST
    Follow us on

    Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 ఈరోజు ఎపిసోడ్ తో పూర్తి కానుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని ఎంతో వైభవంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ ఈవెంట్ కి రాజమౌళి, అలియాభట్, నాని, దేవిశ్రీప్రసాద్, సుకుమార్, రష్మిక, సాయి పల్లవి, కృతిశెట్టి ఇలా చాలా మంది స్టార్స్ అతిథులుగా వస్తున్నారు. సిరి, షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్, మానస్ ఈ ఐదుగురిలో ముందుగా ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు. ఇక మిగిలిన ముగ్గురిలో ఒకరు విన్నర్ అవుతారు. ఎవరు బిగ్ బాస్ ట్రోఫీని అందుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక ఈ ఎపిసోడ్ లో విన్నర్ ను అనౌన్స్ చేస్తుండడంతో ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    టాప్‌ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిని ఎలిమినేట్‌ చేయడానికి హీరోయిన్ రష్మిక మందన్నా, మ్యూజిక్ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ను బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి పంపాడు నాగార్జున. రష్మిక మందన్నా, దేవి శ్రీప్రసాద్‌ హౌస్‌లోకి వెళ్లి హౌస్‌మేట్స్‌తో స్టెప్పులేశారు. తర్వాత ఫైనలిస్టుల ఫొటోలున్న డ్రోన్లను గాల్లోకి వదిలారు. ఇందులో సిరి ఫొటో ఉన్న డ్రోన్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లడంతో ఆమె ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు. దీంతో సిరిని తీసుకుని హౌస్‌ నుంచి బయటకు వచ్చేశారు రష్మిక, దేవి శ్రీ ప్రసాద్‌. ఇక ఈ ఫైనల్ లో సన్నీ గెలిచినట్లు తెలుస్తుండగా… షన్ను కి రెండో ప్లేస్ దక్కింది. శ్రీరామ్ మూడో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.