https://oktelugu.com/

Bigg Boss 5: బిగ్ బాస్ గ్రాండ్ ఫీనాలేలో సన్నీకి … ఐ లవ్ యూ చెప్పిన అలియా భట్

Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 ఈరోజు ఎపిసోడ్ తో పూర్తి కానుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని ఎంతో వైభవంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్‌ప్రైజ్‌లతో ఫినాలే ఎపిసోడ్‌ను ప్లాన్‌ చేశారు నిర్వాహకులు. ఇందులో భాగంగా బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ప్రముఖ స్టార్స్‌ని రంగంలోకి దించారు. ఈ ఎపిసోడ్ లో ఒక్కొకరుగా స్టార్స్ తో మొదలై వరుస గెస్ట్‌లతో స్టేజ్‌ దద్దరిల్లిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 19, 2021 / 08:12 PM IST
    Follow us on

    Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 ఈరోజు ఎపిసోడ్ తో పూర్తి కానుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని ఎంతో వైభవంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్‌ప్రైజ్‌లతో ఫినాలే ఎపిసోడ్‌ను ప్లాన్‌ చేశారు నిర్వాహకులు. ఇందులో భాగంగా బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ప్రముఖ స్టార్స్‌ని రంగంలోకి దించారు. ఈ ఎపిసోడ్ లో ఒక్కొకరుగా స్టార్స్ తో మొదలై వరుస గెస్ట్‌లతో స్టేజ్‌ దద్దరిల్లిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఈవెంట్ కి రాజమౌళి, ‘బ్రహ్మస్త్ర’ టీం నుంచి రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా భట్‌, డైరెక్టర్ అయాన్ పాల్గొన్నారు.

    ఆ తర్వాత అలియాభట్, రణబీర్ కపూర్ లను జంటగా చూసిన హౌస్ మేట్స్ బాగా ఎగ్జైట్ అయ్యారు. సన్నీ అయితే అలియా అంటూ గట్టిగా అరిచాడు. వెంటనే అలియా ‘సన్నీ ఐ లవ్యూ’ అని చెప్పింది. అది విన్న సన్నీ కిందపడిపోతూ కనిపించాడు. తను యాంకర్ గా పనిచేసినప్పుడు అలియాని కలిశానని.. ఆమెతో బాలయ్య డైలాగ్ చెప్పించానని.. మరోసారి వినాలనుకుంటున్నానని అడగ్గా.. ‘దబిడి దిబిడే’ అంటూ బాలయ్య డైలాగ్ చెప్పి ఆకట్టుకుంది అలియా. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో బ్రహ్మాస్త్రం అనే గేమ్ ఆడించారు. ఇందులో టాప్ 5 కంటెస్టెంట్స్ తమలో ఉండే పవర్ గురించి చెప్పాలని.. ఎవరిదైతే బాగా నచ్చుతుందో వాళ్లకి ‘బ్రహ్మాస్త్రం’ ఇస్తామని చెప్పారు.

    ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చానని.. అదే తన పవర్ అని చెప్పాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. కామ్ గా ఉంటూ డెసిషన్ తీసుకోవడం తన పవర్ అని చెప్పాడు మానస్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఇండిపెండెంట్ గా ఉంటూ లక్ష్యాన్ని చేరుకోవడం తన పవర్ అని చెప్పాడు శ్రీరామ్. పేషెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ తన పవర్ అని చెప్పాడు షణ్ముఖ్. స్మైల్ అండ్ కాన్ఫిడెన్స్ తన పవర్ అని చెప్పింది సిరి. మానస్ చెప్పిన ఆన్సర్ తనకు నచ్చిందని రాజమౌళి చెప్పడంతో.. అతడికి ‘బ్రహ్మాస్త్రం’ ఇచ్చారు.