Singer Sunitha Son: నిర్ణయాలు జీవిత గమనాన్ని మార్చేస్తాయి. వాటి ఫలితాలు సక్సెస్ ఫెయిల్యూర్ ని నిర్ణయిస్తాయి. చిన్న వయసులో సింగర్ సునీత తీసుకున్న నిర్ణయం ఆమెను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టింది. 17 ఏళ్లకు పరిశ్రమలో అడుగుపెట్టిన సునీత 19 ఏళ్లకు ప్రేమ వివాహం చేసుకున్నారు. కెరీర్లో సక్సెస్ చూసిన సునీత భర్త విషయంలో ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు ఆయనతో కలిసి ఉండలేక విడాకులు ఇచ్చింది. చాలా కాలంగా సునీత కూతురు, కొడుకుతో ఒంటరిగా ఉంటుంది. కాగా రెండో పెళ్లి ఆమె తీసుకున్న రైట్ డెసిషన్. మీడియా అధినేత రామ్ ని సునీత 2021లో వివాహం చేసుకున్నారు.

నాలుగు పదుల వయసులో మరో వివాహమా అంటూ విమర్శలు వినిపించాయి. దానికి సునీత సమాధానంగా… పిల్లల భవిష్యత్ కోసం కుటుంబ సభ్యుల అనుమతితో తీసుకున్న నిర్ణయం. మీరు నా నిర్ణయాన్ని గౌరవించి, మద్దతుగా ఉంటారని ఆశిస్తున్నాను, అన్నారు. పరిశ్రమ నుండి మిత్రుల నుండి సునీతకు మద్దతు లభించింది. రామ్ తో వివాహం తర్వాత సునీత లైఫ్ స్టైల్ మారిపోయింది. ఒకప్పుడు లేని ఆనందం ఆమె ముఖంలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.
చెప్పినట్లే సునీత పిల్లల భవిష్యత్ కి పునాది వేసే పనిలో నిమగ్నమయ్యారు. ముందుగా కొడుకు ఆకాష్ ని హీరో చేయాలని ప్రయత్నాలు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయట. ఆకాష్ ని పరిచయం చేస్తూ అతని ఫోటో షూట్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఆకాష్ డెబ్యూ ప్రాజెక్ట్ కి నిర్మాత సునీత భర్త రామ్ అట. కోట్ల రూపాయలు ఖర్చు చేసి రిచ్ గా ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారట. సునీత మాట కాదనని రామ్ కొడుకు ఆకాష్ ని భారీగా లాంచ్ చేయనున్నాడనేది తాజా సమాచారం.

ఆకాష్ హీరోని చేయడం ద్వారా అతనికి మంచి కెరీర్ ఇవ్వాలని సునీత ప్రణాళికగా తెలుస్తుంది. ఇక కూతురు శ్రేయా సింగర్ గా రాణించాలని చూస్తున్నారు. తల్లి వలె అమృత స్వరంతో పాడగల సత్తా ఉన్న శ్రేయా ఇప్పటికే కొన్ని చిత్రాల్లో పాడారు. ఆ విధంగా కొడుకును హీరో, కూతురుని సింగర్ చేసి పరిశ్రమలో ఒక స్థాయికి తీసుకురావాలని సునీత ప్రణాళికలు వేస్తున్నారు. మరోవైపు సునీత ఇప్పటికీ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. అలాగే టెలివిజన్ షోస్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.