Urvasivo Rakshasivo Collections: తెలుగు సినిమా ఇటీవల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిన పరిస్థితులు తక్కువే అని తెలుస్తోంది. కొన్ని సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటున్నా.. కమర్షియల్ గా సక్సెస్ కావడం లేదు. లేటెస్ట్ గా అల్లు వారసుడు శిరీష్ నటించిన ‘ఊర్వశివో.. రాక్షాసివో’ గత శుక్రవారం రిలీజ్ అయింది. సినిమా ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. దీంతో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల బాట పడుతున్నారు. అయితే వారం రోజులు గడిచినా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదనే తెలుస్తోంది. సినిమా పై ఇప్పటివరకు బ్యాడ్ ఇంప్రెస్ రాలేదు. అటు కొత్త సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు. దీంతో ఈ సినిమాకు మరో వారం వరకు ఛాన్స్ ఉంది. ఇంతకీ ‘ఊర్వశివో.. రాక్షాసివో’ బిజినెస్ ఎంతయింది..? ఇంకెంత రాబట్టాలి..?

అల్లు శిరీష్ ‘గౌరవం’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు 10 లోపు సినిమాలు తీశారు. అయితే కొన్ని మాత్రం యావరేజ్ అనిపించుకున్నాయి. ప్రస్తుతానికి ఈ స్టార్ కిడ్ కు పెద్దగా మార్కెట్ లేకపోవచ్చు.. కానీ ఆయన నటించిన తాజా మూవీ ‘ఊర్వశివో.. రాక్షాసివో’ మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.7 కోట్ల మేర బిజినెస్ అయినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఆ వసూళ్లు రాబట్టడానికి గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అంతేకాకుండా మూవీ రిలీజ్ నెక్స్ట్ డే రోజు సక్సెస్ మీట్ పెట్టి మరింత హైప్ క్రియేట్ చేశారు.
ఈ నేపథ్యంలో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న బిజినెస్ కాలేదని అర్థమవుతోంది. వారం రోజులుగా పరిశీలిస్తే నైజాంలో రూ.85 లక్షలు, సీడెడ్ లో రూ.28 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.36 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ.21 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ.12 లక్షలు, గుంటూరులో రూ.17 లక్షలు, కృష్ణాలో రూ.19 లక్షలు, నెల్లూరులో రూ.10 లక్షలు చేసింది. మొత్తంగా రూ.4.35 గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇందులో రూ.2.28 కోట్లు షేర్.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, రెస్టాప్ ఇండియా కలిపి రూ.34 లక్షలు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమాకు రూ.2.62 కోట్లు షేర్ చేసింది. ‘ఊర్వశివో.. రాక్షాసివో’ పై ప్రారంభం నుంచి అనేక అంచనాలు నెలకొన్నాయి. దీంతో రూ.7 కోట్లలో రిలీజ్ చేసిన ఈ మూవీ ద్వారా అంతే వసూలవుతాయని ఆశించారు. కానీ బ్రేక్ ఈవెన్ రూ.7.50 కోట్లుగా నమోదైంది. అంటే మరో రూ.4.88 కోట్లు వసూలవుతేనే సినిమా హిట్టయినట్లు లెక్క.. అని చర్చించుకుంటున్నారు.