https://oktelugu.com/

Thaman: మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విజయ రహస్యం ఏంటీ?

Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పేరే విన్పిస్తోంది. స్టార్ హీరోలంతా తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను పెట్టుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇటీవల కాలంలో థమన్ చేసిన సినిమాలన్నీ వరుసగా హిట్టవుతున్నాయి. థమన్ పట్టిందల్లా బంగారం అవుతుండంతో స్టార్ హీరోలు, అగ్రదర్శకులంతా థమన్ తో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో టాలీవుడ్లో థమన్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 6, 2021 / 05:22 PM IST
    Follow us on

    Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పేరే విన్పిస్తోంది. స్టార్ హీరోలంతా తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను పెట్టుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇటీవల కాలంలో థమన్ చేసిన సినిమాలన్నీ వరుసగా హిట్టవుతున్నాయి. థమన్ పట్టిందల్లా బంగారం అవుతుండంతో స్టార్ హీరోలు, అగ్రదర్శకులంతా థమన్ తో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో టాలీవుడ్లో థమన్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

    S. Thaman

    ఈ హీరో.. ఆ హీరో అనే తేడా లేకుండా థమన్ మ్యూజిక్ అందరికీ సాలీడ్ గా సరిపోతుంది. దీంతో అందరి హీరోల అభిమానులకు థమనే ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలుస్తున్నాడు. అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురం’ హిట్ తర్వాత థమన్ నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. థమన్ బీజీఎంకు నందమూరి ఫ్యాన్స్ ఫిదా అవడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

    ‘అఖండ’ మూవీ విజయం వెనుక థమన్ ఇంపాక్ట్ చాలానే ఉందని నందమూరి ఫ్యాన్స్ బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ తో కలిసి ‘బీమ్లానాయక్’ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పలు సాంగ్స్ రిలీజ్ అయ్యారు. పవన్ ఫ్యాన్స్ ఖుషీ చేసేలా థమన్ మ్యూజిక్ ఉండటంతో ‘బీమ్లానాయక్’ సాంగ్స్ ట్రెండింగులో నిలుస్తున్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజు కానుంది.

    ప్రస్తుతం థమన్ టాలీవుడ్లోని టాప్ డైరెక్టర్లు, టాప్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ బీజీగా ఉన్నాడు. మహేష్ బాబు, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలు అతడి చేతిలో ఉన్నాయి. అయితే ఈ విజయం అతడికి దక్కడానికి చాలానే కష్టపడినట్లు తెలుస్తోంది. అందరిలా మూసపద్ధతిలో కాకుండా థమన్ తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు. జనం చూసే కోణంలో సినిమాలపై అవగాహన పెంచుకొని అందుకు తగ్గట్టుగా మ్యూజిక్ అందిస్తున్నాడు.

    సోషల్ మీడియాను ఓ రేంజులో వాడుకుంటుడటం కూడా థమన్ కు బాగా కలిసి వస్తోంది. తన సినిమా పాట విడుదలకు సంబంధించిన ప్రతీ అప్డేట్ థమన్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులను తెలియజేస్తూ హైప్ క్రియేట్ చేస్తుంటాడు. అదేవిధంగా తన అల్బమ్ లోని పాడిన సింగర్స్, లిరిక్స్ రైటర్స్ కు థమన్ తగిన గుర్తింపునిస్తూ ఉంటాడు. దీంతో కొత్తకొత్త సింగర్స్ సైతం లైమ్ లైట్లోకి వస్తున్నారు.

    వాళ్ల ఫ్యాన్స్ సైతం పాటలను ప్రమోట్ చేస్తున్నారు. దీంతో సినిమా విడుదలకు ముందే భారీగా ప్రచారం జరుగుతుంది. డిజిటల్ మాధ్యమాల్లో సినిమాలు చూడటం అలవాటవుతున్న నేటి రోజుల్లో కేవలం ఆడియో ఆల్బమ్ తో నే సినిమాపై థమన్ బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇది సినిమా ప్రచారానికి హెల్ప్ అవుతోంది.

    Also Read: NTR: ఎన్టీఆర్ తో పోటీపడి ఆస్తులను పోగొట్టుకున్న స్టార్ !

    థమన్ తన టీంకు ఇస్తున్న క్రెడిట్ ఇటీవల కాలంలో ఏ దర్శకుడు కూడా ఇవ్వడం లేదు. ఇది కూడా ఒకరకంగా థమన్ మ్యూజిక్ ను ఇష్టపడానికి కారణమవుతోంది.కొంతమంది హీరోల అభిమానులు థమన్ ని ట్రోల్ చేసినా అతడు ఏమాత్రం నిరుత్సాహనికి గురికాకుండా వాళ్లతోనే శభాష్ అనిపించుకుంటూ ముందుకెళుతున్నాడు.

    కేవలం పాటలతోనే కాకుండా మ్యూజిక్ పరంగా వైవిధ్యాన్ని చూపిస్తున్న థమన్ జోరుగా ఇలానే కొనసాగితే అతడికి టాలీవుడ్లో తిరుగుండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    Also Read: OTT Releases of the Week: ఈ వారం ‘ఓటీటీ’ రిలీజ్ ల పరిస్థితేంటి ?