https://oktelugu.com/

Singer Harini: సింగర్​ హరిణి తండ్రి అనుమానస్పద మృతి.. అసలు ఏం జరిగింది?

Singer Harini: ప్రముఖ ప్రేబ్యాక్ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమాస్పద స్థితిలో మృతి చెందారు. బెంగళూరు రైల్వే ట్రాక్​పై ఆయన మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. పోలీసుల సమచారం ప్రకారం.. వారం రోజులుగా హరిణి కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. అటువంటి తరుణంలో ఆమె తండ్రి రైల్వే పోలీసులకు శవమై కనిపించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇప్పటివరకు ఎక్కడికెళ్లారో కూడా తెలియని ఫ్యామిలీ మొత్తం.. ఆయన మరణవార్త విని బెంగళూరు రైల్పే పోలీసు స్టేషన్​లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 25, 2021 / 12:33 PM IST
    Follow us on

    Singer Harini: ప్రముఖ ప్రేబ్యాక్ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమాస్పద స్థితిలో మృతి చెందారు. బెంగళూరు రైల్వే ట్రాక్​పై ఆయన మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. పోలీసుల సమచారం ప్రకారం.. వారం రోజులుగా హరిణి కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. అటువంటి తరుణంలో ఆమె తండ్రి రైల్వే పోలీసులకు శవమై కనిపించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇప్పటివరకు ఎక్కడికెళ్లారో కూడా తెలియని ఫ్యామిలీ మొత్తం.. ఆయన మరణవార్త విని బెంగళూరు రైల్పే పోలీసు స్టేషన్​లో ప్రత్యక్షమయ్యారు.

    Singer Harini

    అసలు ఏకే రావుది హత్యా.. ఆత్మహత్యా తెలియాల్సి ఉంది. వారం నుంచి కనిపించకుండా పోయిన హరిణి, ఆమె కుటుంబ సభ్యులు.. ఇన్నాళ్లు ఎక్కడికెళ్లారనే విషయం కూడా తెలియాల్సి ఉంది కాగా, చనిపోయిన ఏకే వారు.. సుజనా చౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్​కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.  ఈ క్రమంలోనే సింగర్ హరిణి తండ్రి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

    Also Read: పూజా వద్దనుకున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్​.. సమంత చేతుల్లోకి

    మరోవైపు, ఆయన మరణించిన ప్రదేశంలో సూసైడ్ నోట్​ లభించడంతో.. కేసు ఇంకా కీలకంగా మారింది. దానికి తోడు, ఆయన మృతదేహం పక్కనే కత్తి కూడా దొరకడంతో.. అసలు ఆయనను ఎవరైనా హత్య చేశారా.. లేక ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోస్ట్ మార్టంలో కూడా అదే తేలింది.

    అసలు ఆయన ఆత్మహత్య చేసుకోడానికి కారణం ఏంటని పరిశీలించగా..  ఓ బడా వ్యక్తి తనను మోసం చేసినట్లు ఇటీవలే కోరమంగళ పోలీసు స్టేషన్​లో ఏకే రావు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంంలోనే అన్యాయంగా తనపై కేసు పెట్టారని ఇంట్లో వాళ్లతో బాధపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

    Also Read: భర్తతో స్పెయిన్​లో ఎంజాయ్​ చేస్తున్న నిహారిక