https://oktelugu.com/

Sai Dharam Tej: అభినానులనుద్దేశించి సాయిధరమ్ తేజ్​ ఆడియో సందేశం

Sai Dharam Tej: ప్రముఖ టాలీవుడ్ హీరో, మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్​ ఇటీవలే బైక్​పై నుండి కిందపడిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో గాయపడి.. దాదాపు 40 రోజులు అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని.. తన పుట్టిన రోజు డిశ్చార్​ అయి ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఇంట్లో నుండే చికిత్స తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, తాజాగా, ఓ ఆడియో ద్వారా అభిమానులనుద్దేశించి సందేశం ఇచ్చాడు ఈ మెగా అల్లుడు. Also Read: సినిమా టికెట్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 25, 2021 / 12:13 PM IST
    Follow us on

    Sai Dharam Tej: ప్రముఖ టాలీవుడ్ హీరో, మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్​ ఇటీవలే బైక్​పై నుండి కిందపడిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో గాయపడి.. దాదాపు 40 రోజులు అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని.. తన పుట్టిన రోజు డిశ్చార్​ అయి ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఇంట్లో నుండే చికిత్స తీసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, తాజాగా, ఓ ఆడియో ద్వారా అభిమానులనుద్దేశించి సందేశం ఇచ్చాడు ఈ మెగా అల్లుడు.

    Sai Dharam Tej

    Also Read: సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ సీఎం జగన్​కు చిరు విజ్ఞప్తి

    సాయితేజ్ నటించిన రిపబ్లిస్​ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవ కట్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరన లభించింది. కాగా, ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. నవంబరు 26న ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్​ కానుంది.

    ఈ నేపథ్యంలోనే సాయి తేజ్ అభిమానులకు వాయిస్​ మెసేజ్​ ఇచ్చారు.. నేను మీ సాయిధరమ్తేజ్​. నాపై మీరు చూపించిన ప్రేమకు ఎప్పడూ రుణపడి ఉంటాను. నాకు ఆరోగ్యం బాలేనప్పుడు మీరు చూపిన శ్రద్ద, ప్రేమ నేను మర్చిపోలేను. రిపబ్లిక్ సినిమాను మీతో కలిసి చూడలేకపోయా. కానీ, నవంబరు 26న జీ5లో సినిమా స్ట్రీమింగ్​ అవుతోంది. ఈ సినిమా చూసి మీ అభిప్రాయాన్ని తెలపండి.. అంటూ పేర్కొన్నాడుతేజ్​. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట వైరల్​గా మారింది.  రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి తేజ్​కు జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించింది. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిచింది.

    Also Read: ‘ఆర్​ఆర్​ఆర్’​ సోల్​ సాంగ్​ ‘జనని’.. అందులో ఉన్న డెప్త్ ఏంటేంటే?