https://oktelugu.com/

RRR: ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​ రిలీజ్​పై జక్కన్న ఇంట్రెస్టింగ్ హింట్​.. ఇంకా ఏమేం చెప్పారంటే?

RRR: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో డి‌వి‌వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ సినిమా కోసం వరుస ఈవెంట్స్​ను ప్లాన్​ చేశారు రాజమౌళి.. ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 25, 2021 / 12:54 PM IST
    Follow us on

    RRR: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో డి‌వి‌వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ సినిమా కోసం వరుస ఈవెంట్స్​ను ప్లాన్​ చేశారు రాజమౌళి.. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడొస్తుందా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు రాజమౌళి చిన్న హింట్​తో గుడ్​  న్యూస్ చెప్పారు.

    RRR Janani Song Release

    Also Read: ‘ఆర్​ఆర్​ఆర్’​కు అక్కడ పెద్ద సమస్యగా మారిన ‘రాధేశ్యామ్’​!
    తాజాగా ఈ సినిమాలోని జనని అనే సాంగ్ రిలీజ్​ ప్రెస్​మీట్​లో రాజమౌళి మాట్లాడారు. ఈ క్రమంలోనే వరుస ప్లాన్​ ఆఫ్​ యాక్షన్స్​ గురించి స్పందించారు. వచ్చే నెలలో ట్రైలర్​, మల్టిపుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉన్నాయని అన్నారు.  దీంతో పాటు, మీడియాతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని.. అందులో హీరోహీరోయిన్లు పాల్గొంటారని అన్నారు. ఈ సాఫ్ట్ మెలొడీ సాంగ్​ గురించి మాట్లాడుతూ.. సినిమాకు ప్రాణం పోసే పాటగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాటను విలేఖరులకు మాత్రమే చూపించారు. రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు జక్కన్న.

    డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించ నున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    Also Read: ‘ఆర్​ఆర్​ఆర్’​ దెబ్బకు రేసులో నుంచి ‘గంగూబాయి’ ఔట్​!