సామాన్యులకు శుభవార్త.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు?

దేశంలో గడిచిన కొన్ని నెలలుగా వంటనూనె ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. వంటనూనె ధరల పెరుగుదల వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలపై ఊహించని స్థాయిలో భారం పడుతోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సామాన్యులకు ప్రయోజనం చేకూరేలా కీలక ప్రకటన చేసింది. క్రూడ్ పామ్ ఆయిల్‌ పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో కేంద్రం కోత విధించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వంటనూనె ధరలు మరింత దిగిరానున్నాయి. రిటైల్ […]

Written By: Navya, Updated On : June 30, 2021 10:48 am
Follow us on

దేశంలో గడిచిన కొన్ని నెలలుగా వంటనూనె ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. వంటనూనె ధరల పెరుగుదల వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలపై ఊహించని స్థాయిలో భారం పడుతోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సామాన్యులకు ప్రయోజనం చేకూరేలా కీలక ప్రకటన చేసింది. క్రూడ్ పామ్ ఆయిల్‌ పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో కేంద్రం కోత విధించింది.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వంటనూనె ధరలు మరింత దిగిరానున్నాయి. రిటైల్ మార్కెట్‌లో వంట నూనె ధరలు భారీగా తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ నుంచి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ కావడం గమనార్హం. మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల క్రూడ్ పామ్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఏకంగా 10 శాతానికి తగ్గినట్టు తెలుస్తోంది.

అదే సమయంలో రిఫైన్డ్ పామ్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఏకంగా 37.5 శాతానికి దిగొచ్చింది. ఈరోజు నుంచి కేంద్రం అమలు చేస్తున్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు నిర్ణయం అమలులోకి రానుందని సమాచారం. గతంలో క్రూడ్ పామ్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతంగా, ఇతర పామ్ ఆయిల్ కేటగిరిపై 45 శాతంగా ఉండేది. సీబీఐసీ ట్విట్టర్ ఖాతా ద్వారా వంటనూనెల ధరలను భారీగా తగ్గించనున్నట్టు వెల్లడించింది.

కేంద్రం సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. వంటనూనెల ధరలు తగ్గడం వల్ల హోటల్ రంగంపై ఆధారపడిన వాళ్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.