https://oktelugu.com/

Kaatera Movie: కాటేరా సినిమా గురించి ఈ రివ్యూ చదివితే.. ఆ సినిమాను చూడరేమో?

సింగపూర్ లో కన్నడ సినిమాలు విడుదల అవడం చాలా అరుదు. అందులోనూ కాటేరాకు మంచి టాక్ వచ్చిందని ఫ్యామిలీ అందరికీ టికెట్లు బుక్ చేసుకొని మరీ వెళ్లాము.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 16, 2024 / 12:48 PM IST
    Follow us on

    Kaatera Movie: కాటేరా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంతార సినిమా లెవల్ లో ఈ సినిమా కూడా హిట్ ను సొంతం చేసుకుంది. సలార్ సినిమాకు పోటీగా విడుదలై కర్ణాటక సలార్ కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించింది ఈ సినిమా. ఇందులో హీరోగా నటించిన దర్శన్ కర్ణాటకలో అగ్రహీరోలలో ఒకరు. అయితే ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి ఏకంగా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లను సంపాదించి పెట్టింది. ఇక సినిమా విడుదల తర్వాత రివ్యూ కామన్. ఈ సినిమా రివ్యూల్లో ఒక రివ్యూ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ ఏంటంటే..

    ఇంతకీ ఆ రివ్యూలో ఏం రాసారంటే.. సింగపూర్ లో కన్నడ సినిమాలు విడుదల అవడం చాలా అరుదు. అందులోనూ కాటేరాకు మంచి టాక్ వచ్చిందని ఫ్యామిలీ అందరికీ టికెట్లు బుక్ చేసుకొని మరీ వెళ్లాము. అక్కడ దర్శన్ నటన అనుకున్న దానికంటే బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కానీ కథ విషయానికి వస్తే కథ అంత ఒక ఊరు గురించి అందులో ఉన్న ప్రజల గురించి ఉంటుంది అంటూ కామన్ గా చెప్పి.. ఆ తర్వాత మాత్రం సినిమా గురించి అందరూ విస్తుపోయేలా రివ్యూ ఇచ్చారు.

    ప్రజలు, ఊరి వరకు ఇస్తే బాగుండేది. అక్కడితోనే కథను ఆపేస్తే సరిపోతుంది. కానీ కులమత భేధాల వరకు ఎందుకు తీసుకొని వెళ్లారు? ఇప్పటికీ అదే పాయింట్ ని తీసుకొని లాగుతున్నారు. ఈ సినిమాలో ఒక బ్రాహ్మణుడు కూడా ఉంటాడు. బ్రాహ్మణుడు అంటే పేదవాళ్లే అని ఉండాలా. బ్రహ్మణుల కుటుంబంలో కచ్చితంగా కులమత బేధాలు ఉంటాయి అని ఎందుకు పదేపదే చూపిస్తున్నారు. ఈ నాటి కాలంలో బ్రహ్మణులు కూడా వేరే కులం వాళ్లని వేరే మతం వాళ్లని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

    సినిమాలో రక్తపాతం కూడా ఉండేలా కొన్ని పాత్రలను పెట్టారు. కానీ వాటివల్ల ఉపయోగమే లేదు. కాటేరమ్మ అంటే అందరికీ సాయం చేసే దేవత. కాటేరమ్మని పూజించిన ప్రతి ఒక్కరి వెనుక ఉంటుంది ఆ తల్లి. దానికోసం పశువులను బలి ఇవ్వడం ఎందుకు. రక్తపాతాన్ని చూపించడం ఎందుకు? అంటూ సినిమా గురించి ఆశ్చర్యపోయే రివ్యూ ఇచ్చారు. ప్రతి ఒక్కరు సినిమా బాగుంది అంటే..ఈయన మాత్రం సినిమాకు విరుద్దంగా రివ్యూ ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు